"నేను రాజకీయాల నుంచి బయటకు వచ్చాక మళ్లీ ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించలేదు. మీకు ఓ విషయం స్పష్టం చేస్తున్నా. మేం ఇద్దరం(కమల్‌నాథ్, గోవిందా) గతంలో కలిసి పనిచేశాం. ఇప్పుడు పోటీ చేసే ఉద్దేశం నాకు లేదు. నేను వ్యక్తిగత పని మీదనే వచ్చాను."
-గోవిందా, సినీ నటుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ
ఇండోర్ నుంచి నటుడు గోవిందా పోటీ! - ఇండోర్
ప్రముఖ బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ గోవిందా.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను కలిశారు. ఈ భేటీతో గోవిందా ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగనున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి.
కమల్‌నాథ్, గోవిందా
ఇండోర్ స్థానంలో ప్రముఖులను పోటీలో ఉంచాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఇదే విషయమై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. రాజకీయాలపై ఆసక్తి లేదన్న కండల వీరుడి ప్రకటనతో తదుపరి ప్రాధాన్యం గోవిందానే అని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఇవీ చూడండి: