తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టికెట్టు అడిగాడని కండక్టర్​పై పోలీసుల పిడిగుద్దులు..! - బస్సు కండక్టర్​

గొడవ జరిగితే ఆపాల్సిన పోలీసులే తగాదాకి దిగుతుంటే..? టికెట్​ తీసుకోమని కండక్టర్​ అడిగితే డబ్బుల బదులు.. పిడిగుద్దులు ఇచ్చారు పోలీసులు. ఈ ఘటన తమిళనాడులో తిరునెల్వేలిలో చోటుచేసుకుంది.

బస్సు టికెట్టు అడిగాడని పోలీసుల పిడిగుద్దులు

By

Published : Sep 30, 2019, 9:27 PM IST

Updated : Oct 2, 2019, 4:04 PM IST

బస్సు టికెట్టు అడిగాడని పోలీసుల పిడిగుద్దులు
బస్సు టికెట్టు అడిగినందుకు కండక్టర్​ను చితకబాదారు పోలీసులు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో చోటు చేసుకుంది.

ఇదీ జరిగింది...

ఓ బస్సు తిరునెల్వేలి నుంచి నాగర్​కోయిల్​కు ప్రయాణిస్తోంది. ఆ బస్సులో ఉన్న కండక్టర్​ రమేశ్​ యథావిధిగా తన విధుల్ని నిర్వహిస్తున్నాడు. వరుసగా ప్రయాణికులందరికీ టిక్కెట్లు ఇవ్వడం ప్రారంభించాడు. అందులో ఇద్దరు పోలీసులు ఉన్నారు. వారినీ టిక్కెట్లు తీసుకోమని అడగగా... ఎలాంటి స్పందనా లేదు. రమేశ్​​ మిగతా వారికి టిక్కెట్లిచ్చి తిరిగి పోలీసుల వద్దకు వచ్చాడు. వారిని మళ్లీ టికెట్​ తీసుకోమని అడిగాడు. అందుకు ఆగ్రహించిన పోలీసులు సెకన్ల వ్యవధిలో రమేశ్​​ ముఖంపై రక్తం చిందేలా పిడిగుద్దులు విసిరారు. విచక్షణారహితంగా ప్రవర్తించారు. అనంతరం కండక్టర్​పై వాదనకు దిగారు.

చుట్టుపక్కన వారు ఆపినా ఆగలేదు రక్షక భటులు. పోలీసుల వీరంగాన్ని ప్రయాణికులు తమ చరవాణిలో బంధించారు. టిక్కెట్టు తీసుకోమన్నందుకు తనను చితకబాదారని చరవాణిలో స్వీయవీడియో తీసి తన బాధను చెప్పుకున్నాడా కండక్టర్​.

రమేశ్​​ ఆ ఇద్దరు పోలీసులపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఇద్దరిని అరెస్టు చేశారు. కానీ కొద్ది సేపటికే బెయిల్​పై బయటకు రావడం విశేషం.

ఇదీ చూడండి : గుజరాత్​లో ఘోర రోడ్డుప్రమాదం.. 18 మంది మృతి

Last Updated : Oct 2, 2019, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details