తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చిన గూగుల్​ మాప్స్​

గూగుల్​ మాప్స్​.. మనకు తెలియని ప్రదేశాలకు వెళ్తుంటే 'నేనున్నాను' అని ధీమానిచ్చే సాంకేతిక వ్యవస్థ. ఈ వ్యవస్థను ఉపయోగించి ఎన్నో కేసులను ఛేదిస్తున్నారు పోలీసులు. తాజాగా దిల్లీలో నాలుగు నెలల ముందు తప్పిపోయిన బాలికను గూగుల్​ మాప్స్​ సహాయంతో తన తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.

బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చిన గూగుల్​ మాప్స్​

By

Published : Aug 19, 2019, 6:39 AM IST

Updated : Sep 27, 2019, 11:36 AM IST

దిల్లీలో నాలుగు నెలల ముందు తప్పిపోయిన 12 ఏళ్ల బాలికను గూగుల్​ మాప్స్​ సహాయంతో ఆ రాష్ట్ర పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.

మతిస్థిమితం లేని పరిస్థితిలో..

బాలిక మార్చి 21 హోలీ రోజున దిల్లీలోని కీర్తి నగర్​లో ఓ ఆటో ఎక్కింది. ఎక్కడికి వెళ్లాలో చెప్పలేని స్థితిలో ఉన్న బాలికను ఆటో డ్రైవర్​ పోలీసులకు అప్పగించాడు. బాలికకు మతిస్థిమితం లేదని పోలీసులు గుర్తించారు. కొంత సేపు విచారించిన అనంతరం ఆ బాలిక గ్రామం ఖుర్జా అని, తండ్రి పేరు జీతన్​ అని తెలుసుకున్నారు. ఆమె చెప్పిన వివరాలతో నాలుగు ప్రాంతాల్లో విచారించారు. కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు.మరోసారి ఆ బాలికను విచారించారు పోలీసులు. ఆమె తన మామ పింటూతో కలిసి రైలులో ప్రయాణించానని, అతను వాష్​రూమ్​లో తన దుస్తులను తొలగించి పారిపోయాడని వివరించింది. అనంతరం ఆ బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని వైద్య పరీక్షల్లో తేలింది. పింటూపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

సహాయపడిన గూగుల్​ మాప్స్​...

బాలికను తన తల్లిదండ్రులకు అప్పగించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. సరైన వివరాలు తెలుసుకునేందుకు బాలికను పలుమార్లు విచారించారు. ఈ నేపథ్యంలో తన తల్లి ఊరు పేరు సోన్​బర్స అని వెల్లడించింది.
పోలీసులు గూగుల్​ మాప్స్​లో సహాయం పొంది ఉత్తరప్రదేశ్​లోని సిద్దార్ధ్​నగర్​ జిల్లాలో సోన్​బర్స, ఖుర్జా గ్రామాలు ఉన్నాయని గుర్తించారు. అనంతరం బాలికను తన తల్లిదండ్రులకు అప్పగించారు.

'పింటూ ఎవరో తెలియదు'

తన కూతురికి మతిస్థిమితం లేదని, ఆసుపత్రిలో చూపించటానికే దిల్లీ వెళ్లినట్టు బాలిక తండ్రి వివరించాడు. హోలీ రోజున బాలిక తప్పిపోయినట్లు వెల్లడించాడు. అయితే పింటూ పేరుతో తనకు బంధువులు లేరని బాలిక తండ్రి పోలీసులకు చెప్పాడు. తర్వాత పింటూపై కేసును కొట్టివేశారు పోలీసులు.

ఇదీ చూడండి:దయనీయం: నిరుద్యోగి 'డాక్టర్' ఆకలి వ్యథ!

Last Updated : Sep 27, 2019, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details