తెలంగాణ

telangana

By

Published : Feb 15, 2020, 6:32 PM IST

Updated : Mar 1, 2020, 11:02 AM IST

ETV Bharat / bharat

కశ్మీర్​ మ్యాప్​: భారత్​లో ఇలా.. పాక్​లో అలా!

దేశాల సరిహద్దులకు సంబంధించి గూగుల్​ మ్యాప్స్​ కొత్తగా తీసుకొచ్చిన మార్పులు వివాదాస్పదంగా ఉన్నాయి. కశ్మీర్​ సరిహద్దు విషయంలోనూ ఆ మార్పులు కనిపించాయి. మన దేశం నుంచి చూసినప్పుడు భారత్​లో కశ్మీర్​ అంతర్భాగంగానే కనిపించినా.. పాక్​ నుంచి చూసినప్పుడు మాత్రం వివాదాస్పద సరిహద్దును సూచించే 'డాట్​ లైన్​'తో గుర్తించింది గూగుల్​.

GOOGLE, KASHMIR
గూగుల్ కశ్మీర్​ వివాదం

భౌగోళిక చిత్రపటాలకు సంబంధించి ఎక్కువ మంది గూగుల్​ మ్యాప్స్​అనుసరిస్తారు. వినియోగదారుల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు మ్యాప్స్​ను అప్డేట్​ చేస్తూనే ఉంటుంది. తాజాగా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉంటే వాటిని 'డాట్​ లైన్'తో సూచించేలా మార్పులు చేసింది. ఇదే ప్రస్తుత వివాదానికి కారణమైంది.

కశ్మీర్​ సరిహద్దులకు సంబంధించి ఇలాగే వ్యవహరించింది గూగుల్​. భారత్​లోని వినియోగదారులకు మామూలుగానే కశ్మీర్​ సరిహద్దులను గుర్తించినా.. వేరే దేశాలనుంచి పరిశీలించినప్పుడు డాట్​ లైన్లు కనిపిస్తున్నాయని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ పత్రిక వెల్లడించింది.

పాక్​లో నుంచి చూస్తే కశ్మీర్​ సరిహద్దు 'వివాదాస్పదం'గా కనిపిస్తుంది. అదే మన దేశంలో నుంచి చూసినప్పుడు భారత్​లో అంతర్భాగంగానే చూపిస్తోంది.

స్థానిక చట్టాల ప్రకారమే..

ఈ విషయంపై గూగుల్​ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు.

"వివాదాస్పద ప్రాంతాలను న్యాయంగా చూపెట్టేందుకు గూగుల్​ ప్రపంచ విధానాన్ని పాటిస్తుంది. ప్రపంచ వేదికలపై ఆయా దేశాలు ప్రకటించుకునే అంశాలనే గూగుల్​ పరిగణనలోకి తీసుకుంటుంది.

కశ్మీర్​కు సంబంధించి మేం ఎవరికి పక్షపాతంగా వ్యవహరించలేదు. ఉత్పత్తులు ఎప్పుడూ స్థానికత ప్రకారమే అందుబాటులో ఉంచుతాం. maps.google.co.in లో భారత్​ చట్టాల ప్రకారమే వ్యవహరించాం."

-గూగుల్​ అధికార ప్రతినిధి

కశ్మీర్​కు సంబంధించే కాదు.. అర్జెంటీనా నుంచి ఇరాన్​ వరకు వివాదాస్పదమైన సరిహద్దులను ఆయా దేశాల చట్టాల ప్రకారమే గుర్తిస్తోంది గూగుల్.

Last Updated : Mar 1, 2020, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details