దేశవ్యాప్తంగా 2,300 నగరాల్లో 57 వేల పబ్లిక్ టాయిలెట్ల జాబితాను గూగుల్ మ్యాప్స్‌లో పొందుపరిచినట్లు గూగుల్ సంస్థ తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు ఇది తోడ్పడుతుందని అభిప్రాయపడింది.
గూగుల్ మ్యాప్స్ సహాయంతో ప్రజలు తమ సమీపంలోని టాయిలెట్స్‌ని సులభంగా అన్వేషించటానికి వీలుగా ఈ ప్రాజెక్టును ఎంచుకున్నట్లు గూగుల్ మ్యాప్స్ సీనియర్ ప్రోగామ్ మేనేజర్ అనల్ ఘోష్ తెలిపారు.
"పారిశుద్ధ్య సదుపాయాల సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండడం సామాజికంగా మేలు చేస్తోందని భావించాం. పరిశుభ్రతను ప్రోత్సహించడానికి, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ ప్రచారానికి ఇది దోహదపడుతుంది."