తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరేళ్ల తర్వాత శ్రీ పద్మనాభుడి చందన ప్రసాదం - Sree Padmanabhaswamy Temple prasadam

కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో ఆరేళ్ల విరామం తర్వాత చందన ప్రసాదం పంపిణీ తిరిగి ప్రారంభించారు. ఈ బంగారు-పసుపు రంగు చందన ప్రసాదం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ అప్పట్లో నిలిపివేశారు.

Golden sandalwood paste prasadam to be distributed again at Sree Padmanabhaswamy Temple
ఆరేళ్ల తర్వాత శ్రీ పద్మనాభస్వామి ప్రసాదం పంపిణీ

By

Published : Nov 22, 2020, 10:25 AM IST

కేరళ తిరువనంతపురంలోని ప్రసిద్ధ దేవాలయం శ్రీ పద్మనాభస్వామి.. సంప్రదాయ, సుగంద భరితమైన చందన ప్రసాదం పంపిణీ ప్రక్రియను దాదాపు ఆరేళ్ల తర్వాత పునరుద్ధరించారు. బంగారు-పసుపు వర్ణం గల చందన ప్రసాదం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే ఆరోపణలతో అప్పట్లో ఆలయ కార్యనిర్వాహక అధికారిగా ఉన్నకెఎన్​ సతీశ్​ నిలిపివేశారు.

ఆహార భద్రత విభాగం సహా అనేక పరీక్షలు చేసి ధ్రువీకరించిన అనంతరం ప్రసాదం పంపిణీ తిరిగి ప్రారంభించింది కమిటీ. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని శనివారం పునరుద్ధరించడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ట్రావెన్​కోర్​ రాయల్ కుటుంబ సభ్యులు, ఆలయ సలహా కమిటీ సభ్యులు, దేవాలయ కార్యనిర్వహణ అధికారి హాజరయ్యారు.

ఇదీ చూడండి:అనంత పద్మనాభుడి ఆలయ నిర్వహణ ట్రావెన్​కోర్​కే

ABOUT THE AUTHOR

...view details