బంగారం అక్రమ రవాణాను చెన్నై విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో 8.45 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 4.50 కోట్లుగా ఉంటుందని తెలిపారు. అక్రమ రవాణాలో పాల్గొన్న తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
చెన్నై ఎయిర్పోర్ట్లో రూ. 4.5 కోట్ల బంగారం సీజ్ - gold smuggling in Chennai Airport news
బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న 9 మందిని చెన్నై విమానాశ్రయ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 4.50 కోట్ల విలువైన 8.45కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రూ.4.50కోట్ల బంగారం సీజ్- 9 మంది అరెస్ట్
బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు.. శనివారం దుబాయ్ నుంచి వచ్చిన 17మంది ప్రయాణికులను అడ్డుకున్నారు. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని తనిఖీ చేశారు. రూ. 4.16కోట్లు విలువైన 8.18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో ఓ వ్యక్తి నుంచి రూ.14 లక్షల విలువైన 270 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:'కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జీఎస్టీని మార్చేస్తాం'