తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఔరా: మహిళ పొట్టలో బంగారు నిధి - కమ్మ

కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది ఓ మహిళ. ఎక్స్​రే తీసిన వైద్యులు పొట్టలో లోహాలు ఉన్నాయని నిర్ధరించారు. ఆపరేషన్ చేసి చూస్తే పొట్టలో నుంచి విలువైన బంగారు గొలుసులు, చెవిదుద్దులు, ముక్కెరలు, గడియారం బయటపడ్డాయి. బంగాల్లోని రాంపూర్​హాట్​లో జరిగిందీ ఘటన.

ఔరా: మహిళ పొట్టలో బంగారు నిధి

By

Published : Jul 24, 2019, 8:39 PM IST

ఔరా: మహిళ పొట్టలో బంగారు నిధి

ఆకలైతే అందరూ ఏం చేస్తారు... నచ్చిన ఆహారం కడుపునిండా ఆరగిస్తారు. నేటి కాలంలో పిజ్జా, బర్గర్​లు మొదలు అనేక రకాల రుచులు తయార్. మరి పశ్చిమ బంగలోని రాంపూర్​హాట్​కు చెందిన ఓ మహిళ ఏకంగా బంగారం, ఇత్తడి వంటి లోహ ఆభరణాలను ఆరగించిందండోయ్.

చాలా రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది పశ్చిమ బంగలోని రాంపూర్​హాట్​కు చెందిన ఓ మహిళ. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె పొట్టలో లోహ పదార్థం ఉందని డాక్టర్లు నిర్ధరించారు. ఆపరేషన్​ చేస్తూ పొట్టలో ఉన్న లోహాన్ని బయటకు తీస్తూ ఆశ్చర్యపోయారు వైద్యులు.

ఆశ్చర్యానికి కారణం... మహిళ ఉదరంలోంచి ఏకంగా కిలో 680 గ్రాముల లోహ వస్తువులు బయటపడ్డాయి. వాటిలో మెడగొలుసులు, చెవిదుద్దులు, గడియారం, నాణేలు వంటి బంగారు, ఇత్తడి, ఇనుము లోహాలున్నాయి.

శస్త్రచికిత్స అనంతరం మహిళ పరిస్థితి స్థిరంగా ఉందని సీసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నామని ఆపరేషన్ చేసిన వైద్యుడు డాక్టర్ సిద్ధార్థ్ విశ్వాస్ వెల్లడించారు.
బాధితురాలు విపరీతమైన ఆకలితో బాధపడేదని, తమకు దుకాణాలు ఉన్న కారణంగా వాటిలోని నాణేలు, వస్తువులు తిని ఉంటుందని కుటుంబసభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి: కుక్క ప్రేమ వర్సెస్​ యజమాని పరువు..!

ABOUT THE AUTHOR

...view details