తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోవా సీఎంగా సావంత్​ ప్రమాణం - CM

సముద్రతీర రాష్ట్రం గోవాలో ఉత్కంఠ తొలగిపోయింది. మనోహర్​ పారికర్​ అంత్యక్రియలు ముగిసిన కొద్ది గంటల అనంతరమే ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్​ ప్రమోద్​ సావంత్​ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మరో 11 మంది ఎమ్మెల్యేలూ మంత్రులుగా ప్రమాణం చేశారు.

గోవా సీఎంగా సావంత్​ ప్రమాణం

By

Published : Mar 19, 2019, 6:25 AM IST

Updated : Mar 19, 2019, 8:31 PM IST

గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రమోద్​ సావంత్​
గోవాలో భాజపా ప్రయత్నాలు ఫలించాయి. సుదీర్ఘ చర్చలు అనంతరం మిత్రపక్షాల మద్దతుతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగింది. అర్ధరాత్రి అనంతరం సుమారు 2 గంటల సమయంలో ప్రమోద్​ సావంత్​ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్​ మృదుల సిన్హా చేతుల మీదుగా కార్యక్రమంలో పారికర్​ ప్రభుత్వంలోని మంత్రులు తిరిగి ప్రమాణస్వీకారం చేశారు.

ఇదీ చూడండి:గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్​..!

భాజపాకు చెందిన 11 మంది మంది ఎమ్మెల్యేలతో పాటు, గోవా ఫార్వర్డ్​ పార్టీ(జీఎఫ్​పీ), మహారాష్ట్రవాదీ గోమంటక్​ పార్టీ(ఎంజీపీ) నుంచి చెరో ముగ్గురు, మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కాషాయ పార్టీ బలం 20కి చేరింది. సావంత్​ మళ్లీ అసెంబ్లీలో తన మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఎంజీపీ నుంచి సుదిన్​ ధావలికర్​, మనోహర్​, జీఎఫ్​పీ నుంచి విజయ్​ సర్దేశాయ్​, వినోద్​ పాలేకర్​, జయేష్​లున్నారు.

సుదీర్ఘ చర్చల అనంతరం...

పారికర్​ మరణించిన అనంతరం గోవాలో మళ్లీ రాజకీయం వేడెక్కింది. భాజపా మెజార్టీ పడిపోయిందని... తమకు ప్రభుత్వాన్ని ఏర్పరిచేలా ఆదేశాలివ్వాలని గవర్నర్​ను కలిసింది కాంగ్రెస్​. అనంతరం రాష్ట్రంలో వరుస సమావేశాల అనంతరం ప్రమోద్​ సావంత్​ను సీఎంగా ఖరారు చేసింది భాజపా. సావంత్​ను సీఎంగా ఖరారు చేసిన భాజపాప్రమాణస్వీకారంజాప్యం చేస్తూ వచ్చింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కార్యక్రమం నిర్వహించింది.

అయితే... తమకు తగిన బలం లేనందున ఇతర చిన్న పార్టీల మద్దతు కోరింది కాషాయ పార్టీ. సుదీర్ఘ చర్చల అనంతరం వారి డిమాండ్లకు అంగీకరించిన భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగింది. జీఎఫ్​పీ, ఎంజీపీలకు ఉపముఖ్యమంత్రి పదవులు కేటాయించారు. సుదిన్​ ధావలికర్​, విజయ్​ సర్దేశాయ్​లకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. పారికర్​ ముఖ్యమంత్రిగా ఉన్న కేబినెట్​లో ఈ పదవి లేకపోవటం గమనార్హం.

పారికర్​ మరణానంతరం రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను నిశితంగా గమనించిన భాజపా పెద్దలు గోవాకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​షా జీఎఫ్​పీ, ఎంజీపీ పార్టీల ఎమ్మెల్యేలతో పాటు, మరో ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యుల మద్దతు కోసం వేర్వేరు సమావేశాలు నిర్వహించారు.

ఇదీ చూడండి:పారికర్​కు కడసారి వీడ్కోలు

Last Updated : Mar 19, 2019, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details