తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ తొలి లెఫ్టినెంట్​ గవర్నర్​గా ముర్ము ప్రమాణం - jammukashmir latest news

జమ్ముకశ్మీర్​ పునర్విభజన బిల్లు ఆగస్టు 5న పార్లమెంట్​ ఆమోదం పొందిన నేపథ్యంలో నేటి అర్ధరాత్రి నుంచి జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించాయి. జమ్ముకశ్మీర్​ తొలి లెఫ్టినెంట్​ గవర్నర్​గా గిరీష్​ చంద్ర ముర్ము ప్రమాణం స్వీకారం చేశారు. ఆయన చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ గీతా మిత్తల్​ ప్రమాణం చేయించారు.

జమ్ముకశ్మీర్​ తొలి లెఫ్టినెంట్​ గవర్నర్​గా ముర్ము ప్రమాణం

By

Published : Oct 31, 2019, 2:53 PM IST

జమ్ముకశ్మీర్​ తొలి లెఫ్టినెంట్​ గవర్నర్​గా ముర్ము ప్రమాణం
జమ్ముకశ్మీర్​లో నేటి నుంచి నూతన అధ్యాయం ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్​ శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది. ఈ సందర్భంగా తొలి లెఫ్టినెంట్​ గవర్నర్​గా గిరీష్​ చంద్ర ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు.

శ్రీనగర్​లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముర్ముతో.. జమ్ముకశ్మీర్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిత్తల్​ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి పాలన రద్దు..

రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన నేపథ్యంలో అవిభక్త జమ్ముకశ్మీర్​లో విధించిన రాష్ట్రపతి పాలనను గురువారం ఎత్తివేశారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ కార్యాలయం నుంచి అధికారిక నోటిఫికేషన్​ జారీ అయింది.

లేహ్​ లద్దాఖ్​ తొలి లెఫ్టినెంట్​ గవర్నర్​గా రాధాకృష్ణ మాథూర్​ ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నేతలెవరూ పాల్గొనలేదు. దేశం మొత్తం ఒక్కటే అనే సంకేతాన్ని పంపేందుకే... శ్రీనగర్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు.. ఓ అధికారి వెల్లడించారు.

ఇదీ చూడండి:సరికొత్త 'కశ్మీరం'.. చరిత్రలో నూతన శకం

ABOUT THE AUTHOR

...view details