బాలాకోట్ వైమానిక దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య తెలపాలన్న ప్రతిపక్షాలపై భాజపా విమర్శలు గుప్పిస్తోంది. దోమల మందు ధాటికి మృతి చెందిన దోమల్ని రాత్రంతా మేలుకుని లెక్కించలేమని ఛలోక్తులు విసిరారు కేంద్రమంత్రి (రిటైర్డ్) జనరల్ వీకే సింగ్. ఉగ్రవాదుల సంఖ్యను లెక్కించడానికి ఇదేమీ గోళీలాట కాదని ట్విట్టర్లో స్పందించారు.
"తెల్లవారుజాము 3.30 గంటలకు దోమలు విపరీతంగా ఉన్నాయి. నేను హిట్‌తో దోమల్ని చంపేశాను. ఇప్పుడు లెక్కిస్తూ కూర్చోవాలా, చక్కగా నిద్రపోవాలా..?"-(రిటైర్డ్)జనరల్ వీకే సింగ్, విదేశాంగ శాఖ సహాయమంత్రి