తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సార్వత్రికం' తుది దశ సాగిందిలా...... - ప్రముఖులు

'సార్వత్రికం' తుది దశ

By

Published : May 19, 2019, 6:32 AM IST

Updated : May 19, 2019, 5:39 PM IST

2019-05-19 16:55:23

కోల్​కతాలో దీదీ ఓటు..

కోల్​కతాలోని పోలింగ్​ బూత్​లో బంగాల్​ సీఎం మమతా బెనర్జీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

2019-05-19 16:11:44

ఓటేసిన భారత క్రికెట్​ మాజీ సారథి

భారత క్రికెట్​ మాజీ సారథి సౌరవ్​ గంగూలీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంగాల్​లోని బరీషా జన్​కల్యాణ్ విద్యాపీఠ్​ పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు గంగూలీ. 

2019-05-19 15:51:09

3 గంటల వరకు 51.95 శాతం పోలింగ్​..

చివరి దశలో 3 గంటల వరకు అర్ధ భాగం ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. 

2019-05-19 15:35:12

113 ఏళ్ల వయసులో..

బిహార్​ ఆరా లోక్​సభ స్థానం పరిధిలో 113 ఏళ్ల వృద్ధుడు కేశవ్​ సింగ్​ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓ వ్యక్తి సాయంతో పోలింగ్​ కేంద్రానికి చేరుకన్న కేశవ్.. తన బాధ్యతను నిర్వహించారు. 

2019-05-19 14:08:36

బ్యాండ్​బాజాతో ఓట్ల పండగకు....

బ్యాండ్​బాజా

చివరి దశ సార్వత్రిక ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగుతున్నాయి. ఓటర్లు వినూత్నంగా ప్రయత్నిస్తూ ఆకట్టుకుంటున్నారు. మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లోని చంద్రావతిగంజ్​ ప్రాంతానికి చెందిన ఓ పెద్ద కుటుంబం బ్యాండ్​బాజాతో ఊరేగింపుగా పోలింగ్​ కేంద్రానికి వెళ్లింది. కుటుంబంలోని 38 మంది ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడిపారు. 

2019-05-19 14:05:49

పెళ్లి దుస్తుల్లో వధూవరుల ఓటు

మధ్యప్రదేశ్​ ఇండోర్​లోని ఓ పోలింగ్​ కేంద్రంలో నూతన వధూవరులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఓటు వినియోగించుకున్నారు. 

2019-05-19 13:42:18

ఒంటి గంట వరకు ఝార్ఖండ్​లో అత్యధికం

సార్వత్రిక చివరి దశ పోలింగ్​లో ఘర్షణలు జరుగుతున్నాయి. యూపీ, బిహార్​లలో అల్లర్లు... బంగాల్​లో భాజపా-తృణమూల్​ కార్యకర్తలు పరస్పర దాడి ఘటనలు ఎన్నికలను ప్రభావితం చేశాయి. మధ్యాహ్నం ఒంటి గంట ఝార్ఖండ్​లో అత్యధికంగా పోలింగ్​ శాతం నమోదైంది. 

2019-05-19 13:40:30

మురళీ మనోహర్​ జోషి ఓటు...

భాజపా సీనియర్​ నేత మురళీ మనోహర్​ జోషి ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు. 

2019-05-19 12:46:03

ఓటేసిన శతృఘ్న సిన్హా

కాంగ్రెస్​ నేత, పట్నా సాహిబ్​ లోక్​సభ అభ్యర్థి శతృఘ్న సిన్హా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్నాలోని సెయింట్​ సవరిన్స్​ పాఠశాల పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు.  

2019-05-19 12:43:16

భాజపా అభ్యర్థి కారు ధ్వంసం

పశ్చిమ్​ బంగలో పోలింగ్​ ... మళ్లీ అల్లర్లకు దారి తీసింది.

జాదవ్​పుర్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా మండలాధ్యక్షుడితో పాటు, డ్రైవర్​, కారుపై టీఎంసీ కార్యకర్తలు దాడికి దిగారు. భాజపాకు ఓటేయాలని ప్రజలు చూస్తుంటే.. తృణమూల్​ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని, రిగ్గింగ్​ చేస్తున్నారని ఆరోపించారు భాజపా అభ్యర్థి అనుపమ్​ హజ్రా. 

2019-05-19 12:29:43

బంగాల్​లో ఆగని అల్లర్లు

పశ్చిమ్​ బంగలో పోలింగ్​ ... మళ్లీ అల్లర్లకు దారి తీసింది.

జాదవ్​పుర్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా మండలాధ్యక్షుడితో పాటు, డ్రైవర్​, కారుపై టీఎంసీ కార్యకర్తలు దాడికి దిగారు. భాజపాకు ఓటేయాలని ప్రజలు చూస్తుంటే.. తృణమూల్​ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని, రిగ్గింగ్​ చేస్తున్నారని ఆరోపించారు భాజపా అభ్యర్థి అనుపమ్​ హజ్రా. 

2019-05-19 12:22:41

కుటుంబ సమేతంగా ఓటేసిన సిద్ధూ

పంజాబ్​ మంత్రి, కాంగ్రెస్​ నేత నవ్​జోత్​ సింగ్​ సిద్ధూ... తన భార్య నవ్​జోత్​ కౌర్​తో కలిసి అమృత్​సర్​లోని 134వ పోలింగ్​ కేంద్రంలో ఓటేశారు. 

2019-05-19 12:18:20

ఓటేసిన స్వతంత్ర భారత తొలి ఓటరు

స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యాం శరణ్​ నేగి హిమాచల్​ప్రదేశ్​లోని పోలింగ్​ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1951లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో ఓటు వేసిన ఈయన.. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటు వేశారు. ఎన్నికల సిబ్బంది దగ్గరుండి ఆయనను పోలింగ్​ కేంద్రానికి తీసుకెళ్లారు. 

2019-05-19 11:39:21

ఎస్పీ- భాజపా నేతల పరస్పర దాడి

యూపీలో ఘర్షణ

ఉత్తర్​ప్రదేశ్​ పరాహుపుర్​లోని ఓ పోలింగ్​ కేంద్రం ఎదుట వాగ్వాదానికి దిగారు ఎస్పీ- భాజపా మద్దతుదారులు. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఉత్తర్​ప్రదేశ్​లోని 13 లోక్​సభ నియోజకవర్గాల్లో చివరి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ​

2019-05-19 11:09:04

లోక్​సభ స్పీకర్​ ఓటు..

లోక్​సభ స్పీకర్, భాజపా సీనియర్​ నాయకురాలు​ సుమిత్రా మహాజన్​ సార్వత్రిక చివరి విడత ఎన్నికల్లో ఓటేశారు. మధ్యప్రదేశ్​ ఇండోర్​లోని పోలింగ్​ కేంద్రంలో ఓటింగ్​ ప్రక్రియలో భాగస్వామ్యులయ్యారు. 

2019-05-19 11:05:38

ఓటేసిన అనురాగ్​ ఠాకుర్​, ప్రేమ్​ ధుమాల్​

భాజపా ఎంపీ అనురాగ్​ ఠాకుర్​, ఆ పార్టీ సీనియర్​ నేత ప్రేమ్​ కుమార్​ ధుమాల్​ హిమాచల్​ ప్రదేశ్​లోని హమీర్​ఫుర్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

2019-05-19 10:43:26

బంగాల్​లో ఓటర్ల నిరసన

పశ్చిమ్​ బంగలో ఈ దశలోనూ పోలింగ్​.. సక్రమంగా జరగట్లేదు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బసిర్​హట్​లోని 189వ పోలింగ్​ కేంద్రం ఎదుట ఓటర్లు ఆందోళనకు దిగారు. టీఎంసీ కార్యకర్తలు తమను ఓటింగ్​కు అనుమతించట్లేదంటూ నిరసనలు చేస్తున్నారు. 100 మందితో కూడిన బృందం ఓటు వేయకుండా అడ్డుకుంటుందంటున్నారు అక్కడి భాజపా లోక్​సభ అభ్యర్థి 

2019-05-19 10:29:09

ఉత్సాహంగా తొలిసారి ఓటర్లు...

సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నారు. తొలి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు పశ్చిమ్​ బంగలోని కొందరు మహిళలు. బంగాల్​లోని 9 లోక్​సభ స్థానాలకు ఈ దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 

2019-05-19 10:25:51

హిమాచల్​ సీఎం ఓటు వినియోగం

హిమాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్​ మండి జిల్లా 36వ పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు. 

2019-05-19 09:58:22

కుటుంబ సమేతంగా ఓటేసిన భాజపా జాతీయ కార్యదర్శి

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్​ విజయ్​వర్గీయ్​.. కుటుంబసమేతంగా చివరి విడత ఓటింగ్​లో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్​ ఇండోర్​లోని 316వ పోలింగ్​ కేంద్రంలో ఓటేశారు. 

2019-05-19 09:27:31

9 గంటల వరకు ఓటింగ్​ శాతాలిలా...

చివరి విడత సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు పోలింగ్​ శాతాలు వెల్లడించింది ఈసీ. ఝార్ఖండ్​లో అత్యధికంగా 15 శాతం మంది ఓటు వినియోగించుకున్నారు.

రాష్ట్రాల వారిగా 9 గంటల వరకు పోలింగ్​ శాతాలు..

  1. బిహార్​                                   -          10.65 
  2. హిమాచల్​ ప్రదేశ్​                  -          3.36
  3. మధ్యప్రదేశ్​                          -          12.07
  4. పంజాబ్​                                -          9.73
  5. ఉత్తర్​ప్రదేశ్​                          -          8.29
  6. బంగాల్​                                -          14.22
  7. ఝార్ఖండ్​                              -          15.00
  8. ఛండీగడ్​                              -          10.40 
  9. ఛండీగడ్​                              -          10.40

2019-05-19 09:08:59

కేంద్ర మంత్రి రవిశంకర్​ ఓటు

కేంద్ర మంత్రి, భాజపా నేత రవిశంకర్​ ప్రసాద్​ రవిశంకర్​ ప్రసాద్​ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్నా మహిళా కళాశాలలోని 77వ పోలింగ్​ బూత్​లో ఓటేశారు. 

2019-05-19 08:27:43

ఓటేసిన మమతా మేనల్లుడు

దక్షిణ కోల్​కతా పార్లమెంటరీ నియోజకవర్గంలోని 208వ పోలింగ్​ కేంద్రంలో బంగాల్​ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు.. అభిషేక్​ బెనర్జీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

2019-05-19 08:00:01

'క్యూ'లో హర్భజన్​ ​

భారత మాజీ క్రికెటర్​ హర్భజన్​ సింగ్​.. ఓటేసేందుకు పంజాబ్​ జలంధర్​లోని​ గఢీ పోలింగ్​ కేంద్రం ముందు వరుసక్రమంలో నిల్చున్నారు. 

2019-05-19 07:29:17

నితీశ్​ కుమార్​ ఓటు వినియోగం

బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్..​ సార్వత్రికం చివరి దశలో ఓటేశారు. పట్నా రాజ్​భవన్​ పాఠశాలలోని 326వ పోలింగ్​ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు జేడీ(యు) నేత. 

2019-05-19 07:23:56

ఓటర్లకు మోదీ విజ్ఞప్తి..

2019 లోక్​సభ ఎన్నికల చివరి దశ పోలింగ్​ జరుగుతున్న తరుణంలో మోదీ ట్వీట్​ చేశారు. ఈ విడతలో ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తొలి సారి ఓటు వేసే యువత.. భారత బంగారు భవిష్యత్తును నిర్ణయించే ఓటింగ్​లో ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 

2019-05-19 07:19:03

బరిలో ప్రముఖులు

చివరి దశ సార్వత్రిక పోరులో ప్రముఖులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. యూపీ వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ , పాటలీపుత్రలో ఆర్జేడీ అధినేత లాలూ తనయ మిశా భారతి, పట్నా సాహిబ్​ నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​, కాంగ్రెస్​ నేత శతృఘ్న సిన్హా అమీతుమీ తేల్చుకోనున్నారు. పంజాబ్​ గురుదాస్​పుర్​లో సన్నీదేఓల్​పై ఆశలు పెట్టుకుంది కాషాయ పార్టీ.

2019-05-19 07:10:15

ఓటేసిన 'యోగి'

ఓటేసిన 'యోగి'

సార్వత్రికం చివరి విడత ఎన్నికల్లో ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోరఖ్​పుర్​లోని 246వ పోలింగ్​ కేంద్రంలో ఓటేశారు.

2019-05-19 07:02:00

చివరి దశ పోలింగ్​ ప్రారంభం

సార్వత్రికం ఏడో విడత పోలింగ్​ ప్రారంభమైంది. ఈసీ కట్టుదిట్టమైన భద్రత నడుమ 7 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో చివరి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. 

2019-05-19 06:07:02

కాసేపట్లో 'సార్వత్రిక ఎన్నికల' తుది దశ...

తుది దశ పోలింగ్​ వివరాలు

లోక్​సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆరు దశలు పూర్తికాగా ఆఖరిదైన ఏడో విడత పోలింగ్ కాసేపట్లో మొదలుకానుంది. ఓటింగ్​ ప్రక్రియ సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఏడో విడతలో భాగంగా 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10.01 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి లక్షా 12 వేల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.

Last Updated : May 19, 2019, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details