తెలంగాణ

telangana

ETV Bharat / bharat

16 ఏళ్లకే ఇంగ్లీష్​ ఛానల్ ఈదేసిన భారతీయురాలు! - రాజస్థాన్

పదహారేళ్ల యువతి అత్యంత ప్రమాదకరమైన కాలువను సునాయాసంగా ఈదేసింది. 40 కిలోమీటర్ల 'ఇంగ్లీష్ ఛానల్‌'ను 13 గంటల్లోనే దాటేసింది గౌర్వీ సింఘ్వీ. భారత్‌ నుంచి ఈ సాహసం చేసిన పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది.

16 ఏళ్లకే ఇంగ్లీష్​ ఛానల్ ఈదేసిన భారతీయురాలు!

By

Published : Sep 11, 2019, 7:59 PM IST

Updated : Sep 30, 2019, 6:37 AM IST

16 ఏళ్లకే ఇంగ్లీష్​ ఛానల్ ఈదేసిన భారతీయురాలు!
దక్షిణ ఇంగ్లాండ్‌ నుంచి ఉత్తర ఫ్రాన్స్‌ వరకు వ్యాపించి ఉన్న ఇంగ్లీష్ ఛానల్‌ను రాజస్థాన్​ ఉదయ్​పుర్‌కు చెందిన పదహారేళ్ల గౌర్వీ సింఘ్వీ విజయవంతంగా ఈది రికార్డు సృష్టించింది. 40 కిలోమీటర్లు విస్తరించిన కాలువను 13 గంటల 26 నిమిషాల్లోనే దాటేసింది. ఈ సంవత్సరం భారత్‌ నుంచి ఇంగ్లీష్‌ ఛానల్‌ ఈదిన పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది.

"భారత దేశంలో నేను ఈదేటప్పుడు ఎదుర్కొన్న ఆటంకాలు, ఇక్కడ ఎదుర్కొన్న ఆటంకాలు పూర్తిగా భిన్నమైవి. ఇక్కడ ఎండ ఎక్కువ. నీరు వేడిగా ఉంటుంది. నీటిలోని మురికితో వాంతులు రావడం, నూనె వాసనలకు తల తిరగడం వంటివి చాలా ఇబ్బందులున్నాయిక్కడ."
-గౌర్వీ సింఘ్వీ

గతంలో జుహు నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా వరకు ఉన్న 22 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది గంటల 22 నిమిషాలలో దాటింది గౌర్వీ సింఘ్వీ. ఇప్పుడు ఇంగ్లీష్ ఛానల్ దాటాలన్న తన కల నెరవేరినట్లయిందని ఆనందం వ్యక్తంచేసింది. సముద్రంలో జరిగే ఈతను జాతీయ ఫెడరేషన్ అధికారికంగా గుర్తించనప్పటికీ.. తన ప్రయాణం కొనసాగుతుందని సింఘ్వీ స్పష్టం చేసింది.

Last Updated : Sep 30, 2019, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details