ఊరిలో ఎటువైపు చూసినా చెత్త ఉంటోంది. కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన వ్యర్థాలతో వచ్చే దుర్వాసన అంతా ఇంతా కాదు. చుట్టుపక్కల గ్రామాల చెత్తనూ ఇక్కడే పడేస్తారు. దీని వల్ల ఆ గ్రామం డంప్ యార్డుగా మారింది. చెత్తను కాల్చినప్పుడు వచ్చే పొగ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ ప్రభావం గ్రామస్థుల ఆరోగ్యంపైనే కాదు... యువకుల జీవితం మీదా పడింది.
ఆ గ్రామంలోని యువకులు చాలా మంది ఉన్నత విద్యలు అభ్యసించారు. కానీ పెళ్లి సంబంధం కోసం వచ్చే యువతుల తల్లిదండ్రులు సుల్తాపూర్ పరిస్థితిని చూసి భయపడిపోతున్నారు. ఇలాంటి పరిసరాలున్న ఇంటికి తమ కూతురిని పంపలేమని వెనుదిరుగుతున్నారు. వివాహం చేసుకోవాలంటే గ్రామం విడిచి వెళ్లాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.