పవిత్రమైన గంగానది నీరు తాగడానికి పనికిరాదని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) తేల్చి చెప్పింది. నీటిని శుద్ధి చేసినా... నది ప్రవహించే ఏడు ప్రదేశాల్లోనే నీరు తాగే అవకాశముందని తెలిపింది. నీటిలో కోలిఫార్మ్ అనే బ్యాక్టీరియా అధికంగా ఉండటమే కారణమని వివరించింది.
సమాచార సేకరణ కోసం దేశవ్యాప్తంగా 86 పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది బోర్డు. నీటిని శుద్ధి చేసి చేపట్టిన పరీక్షలో 7 ప్రాంతాల్లోని నీరు మాత్రమే తాగడానికి ఉపయోగపడుతుందని, మిగిలిన 78 ప్రాంతాలు పనికిరావని బోర్డు తేల్చింది. వీటిలో 18 ప్రాంతాలు స్నానాలకు వినియోగించవచ్చన్నారు.