తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ వ్యాప్తంగా 'జై జై గణేశా' నామస్మరణ

గణేశ్​ చతుర్థిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉత్సవాలు మిన్నంటాయి. భక్తులు తెల్లవారు జామునుంచే తమ విఘ్నాలను తొలగించాలని.. గణనాథునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

మిన్నంటినన గణేశ్​ ఉత్సవాలు

By

Published : Sep 2, 2019, 7:53 AM IST

Updated : Sep 29, 2019, 3:33 AM IST

మిన్నంటిన గణేశ్​ ఉత్సవాలు

దేశ వ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యయి. దిల్లీ, ముంబయి సహా దేశంలోని ప్రధాన నగరాలన్నీ లంబోదరుడి సేవలో తరిస్తున్నాయి. ప్రముఖ గణేశ్​ ఆలయాల వద్ద తెల్లవారు జామునుంచే భక్తుల కోలాహలం మొదలైంది. ప్రత్యేక పూజలతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుండటం వల్ల పరిసర ప్రాంతాలన్ని గణనాథుని నామస్మరణతో మార్మోగుతున్నాయి.

ముంబయిలోని లాల్​బాగ్​ఛా రాజా బొజ్జ గణపయ్యా వద్ద ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలయింది. కోర్కెలు తీర్చే గణపయ్యగా ఈ ఆలయాని గణనాథునికి పేరుంది. ఈ నేపథ్యంలో గణేషుడిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. వీటికితోడు ఈ సారి లాల్​బాగ్​ఛారాజా విఘ్నేషున్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. భారత​ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రాజెక్టు చంద్రయాన్​-2 ప్రతిమలను సైతం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. గణేశ్​ మండపంలో ఈ ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Last Updated : Sep 29, 2019, 3:33 AM IST

ABOUT THE AUTHOR

...view details