తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుర్తింపు కోల్పోతున్న గాంధీ రెండో స్మారకం

జాతిపిత మహాత్మాగాంధీ సమాధి దిల్లీ రాజ్​ఘాట్​లో ఉందని మాత్రమే తెలుసు. కానీ.. అదే పేరుతో మధ్యప్రదేశ్​లో మరొకటుందని తెలుసా? మొదట బడ్వానీలో స్థాపించిన స్మారకాన్ని.. అనంతరం ముంపు ప్రభావంతో కుక్రికి మార్చారు. అప్పటినుంచి ఈ స్మారకం తన గుర్తింపును కోల్పోతూ వస్తోంది. సందర్శకుల రాక క్రమక్రమంగా తగ్గుతోంది.

గుర్తింపు కోల్పోతున్న గాంధీ రెండో స్మారకం

By

Published : Aug 24, 2019, 7:03 AM IST

Updated : Sep 28, 2019, 1:55 AM IST

గుర్తింపు కోల్పోతున్న గాంధీ రెండో స్మారకం

జాతిపిత మహాత్మా గాంధీ, ఆయన సిద్ధాంతాలు... ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తి.

ఏటా బాపూ జయంతి నాడు వేలాది మంది దిల్లీ రాజ్​ఘాట్​కు వెళ్లి, ఆ మహాపురుషుడికి నివాళులు అర్పిస్తారు.

గాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా... ఆయన జ్ఞాపకార్థం నిర్మించిన మరో స్మారకం గురించి తెలుసుకుందాం.

గాంధీ తొలి స్మారకం... దిల్లీ యమునా నది తీరాన ఉంది. రెండోది... మధ్యప్రదేశ్​లో నర్మద నది ఒడ్డున బడ్వానీలో ఉంది.

కానీ... 2017లో ఈ స్మారకాన్ని కుక్రి గ్రామానికి మార్చారు. సర్దార్​ సరోవర్​ డ్యామ్​ కారణంగా బడ్వానీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండడమే ఇందుకు కారణం.

స్మారకాన్ని మరో గ్రామానికి మార్చినప్పటి నుంచి సందర్శకుల రాక తగ్గిపోయింది.

ఈ స్మారక కేంద్రం ఎంతో ప్రత్యేకం. గాంధీ, ఆయన భార్య కస్తూర్బా, కార్యదర్శి మహదేవ్​ దేశాయ్​ అస్తికలు ఇక్కడ ఉంటాయి.

గాంధేయవాది కాశీనాథ్​ త్రివేది... గాంధీ అస్తికలను ఇక్కడకు తీసుకొచ్చారు. 1965 ఫిబ్రవరి 12న ఈ స్మారకాన్ని నెలకొల్పారు. దిల్లీలో ఉన్న స్మారకం తరహాలోనే దీనికీ రాజ్​ఘాట్​ అని నామకరణం చేశారు.

కానీ... కాలం గడిచేకొద్దీ ఈ స్మారకం గుర్తింపు కోల్పోతోంది. సందర్శకుల రాక తగ్గిపోతోంది. ఈ పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు బడ్వానీ వాసులు.

"ఈ స్మారకాన్ని ఒకరోజు ఉదయం 5 గంటలకు ప్రభుత్వం బడ్వానీ నుంచి కుక్రీకి తరలించింది. గ్రామస్థుల ఆకాంక్షకు వ్యతిరేకంగా ఈ పనిచేశారు. నిరసన తెలిపినవారిపై లాఠీఛార్జి చేశారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు దోపిడీ చేసినట్లుగా ఉంది. స్థానికులకు చాలా అన్యాయం జరిగింది."

-బడ్వానీ వాసి

"ఇక్కడకు అసలు సందర్శకులు రావడంలేదు. బడ్వానీలో స్మారకాన్ని దర్శించుకునేందుకు చాలా మంది వస్తుండేవారు. అక్కడ నుంచి చితాభస్మాన్ని తీసుకెళతారని మా గ్రామస్థులు ఎప్పుడూ ఊహించలేదు."

-గ్రామస్థురాలు, బడ్వానీ

"ఇక్కడ సరైన ఏర్పాట్లు లేవు. కొన్ని రోజులు లైట్లు వెలిగాయి. తర్వాత అవి పనిచేయడంలేదు. పైకప్పు సరిగా లేదు. అక్టోబర్ 2న ప్రభుత్వ అధికారులు వచ్చి తూతూమంత్రంగా గాంధీకి నివాళులు అర్పిస్తారు. తర్వాత ఎవరూ పట్టించుకోరు."

దిల్లీ రాజ్​ఘాట్​కు సందర్శకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. మధ్యప్రదేశ్​లోని స్మారకం మాత్రం అస్తిత్వం కోసం పోరాడుతోంది.

ఇదీ చూడండి:''మహాత్ముడు లేకున్నా... ఆయన భావజాలం బతికే ఉంది''

Last Updated : Sep 28, 2019, 1:55 AM IST

ABOUT THE AUTHOR

...view details