కరపత్రం వివాదంలో గౌతమ్ గంభీర్‌కు క్రికెటర్ల మద్దతు లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పు దిల్లీ అభ్యర్థి అతిషిపై అభ్యంతరకర పదజాలంతో కూడిన కరపత్రాలు పంచారన్నది గంభీర్‌పై ఆరోపణ. ఇప్పటికే తనకెలాంటి సంబంధం లేదంటూ ఈ విషయాన్ని ఖండించారు గంభీర్.
తాజాగా క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్ ఈ అంశంలో గంభీర్‌కు అండగా నిలిచారు. ఈ వివాదంపై ఇరువురూ స్పందిస్తూ ట్వీట్లు చేశారు.
"నిన్నటి పరిణామాలతో దిగ్భ్రాంతికి గురయ్యా. గంభీర్‌పై ఆరోపణలు బాధించాయి. రెండు దశాబ్దాలుగా తెలిసిన అతని వ్యక్తిత్వం, నిజాయితీ, మహిళల పట్ల అతనికి ఉండే గౌరవం ఏంటో నాకు తెలుసు. అతని గురించి నేను హామీ ఇవ్వగలను."
-వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్
గంభీర్ అలాంటి వ్యక్తి కాదే... లక్ష్మణ్‌తోపాటు గంభీర్‌కు ప్రముఖ స్పిన్ మాంత్రికుడు హర్భజన్ మద్దతు పలికాడు.
"గంభీర్ గురించి నిన్న జరిగిందంతా తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. నాకు గంభీర్ బాగా తెలుసు. మహిళల పట్ల అతను ఏనాడూ అలా ప్రవర్తించడు. ఎన్నికల్లో గెలుస్తాడా, ఓడతాడా అనేది తర్వాతి విషయం. గంభీర్ వీటన్నింటికంటే ఎక్కువ."
-హర్భజన్ సింగ్ ట్వీట్
గంభీర్ అలాంటి వ్యక్తి కాదే...