కర్ణాటకలో ఏటా జరిగే ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరా పండుగలో భాగంగా నిర్వహించే సంప్రదాయ ఏనుగుల ఊరేగింపు కోసం.. సుందరంగా ముస్తాబు చేసిన గజరాజులు హునసూరు నుంచి మైసూరుకు బయల్దేరాయి. మంత్రి అశోక్, స్థానిక ఎమ్మెల్యే, అటవీ అధికారులు పాల్గొని పూజాకార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రక్రియతోనే కర్ణాటకలో దసరా ఆరంభమవుతుంది.
మైసూరు దసరా ఉత్సవాలకు బైలెల్లిన గజరాజులు - హుసనూరు
కర్ణాటకలో ప్రసిద్ధిచెందిన మైసూరు దసరా ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పండుగలో భాగంగా సంప్రదాయం ప్రకారం ఏనుగులను ఊరేగింపుగా మైసూర్‌కు తీసుకొచ్చే కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
మైసూరు దసరా ఉత్సవాలకు బైలెల్లిన గజరాజులు
మొదటి బృందంలోని అర్జున, అభిమన్యు, విజయ, వరలక్ష్మి, ఈశ్వర, ధనంజయ అనే ఆరు ఏనుగులను తరలించారు. రెండో బృందంలోని 8 గజరాజులు మరోసారి బయలుదేరుతాయి.
దేశంతో పాటు రాష్ట్రంలో వరద పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని దసరా ఉత్సవాల్ని నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది కర్ణాటక ప్రభుత్వం. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకు మైసూరులో దసరా ఉత్సవాలు జరగనున్నాయి.
Last Updated : Sep 27, 2019, 10:09 PM IST