తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాతీయ గీతం ఆలపిస్తుండగా సొమ్మసిల్లిన గడ్కరీ - అస్వస్థత

భాజపా సీనియర్​ నేత, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్ర సోలాపుర్​లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తుండగా సొమ్మసిల్లి కూర్చుండిపోయారు.

జాతీయ గీతం ఆలపిస్తుండగా సొమ్మసిల్లిన గడ్కరీ

By

Published : Aug 1, 2019, 4:07 PM IST

జాతీయ గీతం ఆలపిస్తుండగా సొమ్మసిల్లిన గడ్కరీ
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ అస్వస్థత కారణంగా బహిరంగ సభలోనే సొమ్మసిల్లారు. మహారాష్ట్ర సోలాపుర్​లోని పున్యశ్లోక్​ అహిల్యాదేవి హోల్కర్​ సోలాపుర్​ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కార్యక్రమంలో భాగంగా జాతీయ గీతం ఆలపిస్తుండగా అస్వస్థతకు లోనయ్యారు గడ్కరీ. నిల్చోలేకపోయిన ఆయన వెంటనే కూర్చుండిపోయారు. అనంతరం గడ్కరీని స్థానిక వైద్యులు పరీక్షించారు. బీపీ, రక్తంలో షుగర్​ స్థాయిలు సాధారణ స్థితిలో ఉన్నాయని తెలిపారు. బుధవారం సాయంత్రం గొంతు నొప్పికి తీసుకున్న ఆంటీబయాటిక్స్​​ కారణంగానే అనారోగ్యానికి లోనైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

బహిరంగ సభల్లో గడ్కరీ అస్వస్థతకు లోనవటం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఇలా జరిగాయి. గతేడాది డిసెంబర్​లో మహారాష్ట్ర అహ్మద్​నగర్​లో జరిగిన ర్యాలీలోనూ సొమ్మసిల్లారు.

ఇదీ చూడండి: 'ఉన్నావ్'​ విచారణకు సుప్రీం 45 రోజుల గడువు

ABOUT THE AUTHOR

...view details