తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కేంద్రం వైఫల్యం హార్వర్డ్ కేస్ స్టడీగా మారుతుంది' - GST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. కరోనా వైరస్, జీఎస్టీ, నోట్ల రద్దు అమలులో ప్రభుత్వ వైఫల్యం భవిష్యత్‌లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్​లో కేస్ స్టడీగా మారుతుందంటూ రాహుల్ దుయ్యబట్టారు.

Future Harvard case studies on failure to tackle COVID-19, demonetisation and GST: Rahul Gandhi
'కేంద్రం వైఫల్యం హార్వర్డ్ కేస్ స్టడీగా మారుతుంది'

By

Published : Jul 6, 2020, 11:52 AM IST

దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొవిడ్ కేసుల్లో రష్యాను దాటి మూడో స్థానంలో భారత్ నిలిచిన నేపథ్యంలో రాహుల్‌...కేంద్రాన్ని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు.

కరోనా వైరస్, జీఎస్టీ, నోట్ల రద్దు అమలులో ప్రభుత్వ వైఫల్యం భవిష్యత్‌లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కేస్ స్టడీగా మారుతుందంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగాలను ఎద్దేవా చేస్తూ ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. ఈ వీడియోలో మహాభారత యుద్ధంలో పాండవులు 18 రోజుల్లో గెలిచారని, కరోనాకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో దేశం 21 రోజుల్లో విజయం సాధిస్తుందన్న ప్రధాని మాటలను ఆయన పోస్ట్‌ చేశారు. కరోనావైరస్ కేసుల పెరుగుదలకు సంబంధించిన గ్రాఫ్‌ను వీడియోలో పొందుపరిచారు.

ఇదీ చూడండి:ఒక్కరోజులో 24,248 కేసులు.. మూడో స్థానానికి భారత్​

ABOUT THE AUTHOR

...view details