పాఠశాలల పరిసర ప్రాంతాల్లో 50 మీటర్ల దూరం వరకు ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలు(జంక్ ఫుడ్), వాటి ప్రకటనలపై ఆంక్షలు విధించేందుకు భారత ఆహార భద్రత, నాణ్యత ప్రాధికార సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రతిపాదనలు తీసుకొచ్చింది.
పాఠశాల విద్యార్థుల పరిపూర్ణ ఆరోగ్య సంరక్షణకు ఈ ప్రతిపాదనలు తెచ్చినట్లు "ఎఫ్ఎస్ఎస్ఏఐ" సీఈఓ పవన్ కుమార్ అగర్వాల్ తెలిపారు. పాఠశాల పరిసరాల్లో అందుబాటులో ఉండాల్సిన సురక్షిత పోషకాహారం జాబితాపై ఓ ముసాయిదాను రూపొందించి, తుది అనుమతి కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. పాఠశాల చిన్నారుల ఆరోగ్య భద్రతపై పరిశ్రమల సమాఖ్య అసోచామ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
పాఠశాల చిన్నారులు తీసుకునే ఆహారంపై నిబంధనలు తీసుకురావాలని ఆహార నియంత్రణ సంస్థకు 2015లో దిల్లీ హైకోర్టు సూచించడం గమనార్హం.