తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పచ్చని 'కప్ప'ల కాపురంలో విడాకుల చిచ్చు! - bhopal

పెళ్లై ముచ్చటగా మూడు నెలలైనా కాలేదు.. అప్పడే ఆ జంట వేరైంది. వారిద్దరి విడాకులకు వారి మధ్య పొరపచ్చాలేవో కారణం కాదు.. వారు వేరయ్యేందుకు భారీ వర్షాలే కారణం. అవును వర్షాలు కురవాలని 'కప్ప' జంటకు ఘనంగా పెళ్లి చేశారు. కాని అదే జంటను ఇప్పుడు అధిక వర్షాలను ఆపేందుకు నిర్దాక్షిణ్యంగా విడదీసేశారు.

పచ్చని 'కప్ప'ల కాపురంలో విడాకుల చిచ్చు!

By

Published : Sep 13, 2019, 6:32 AM IST

Updated : Sep 30, 2019, 10:16 AM IST

పచ్చని 'కప్ప'ల కాపురంలో విడాకుల చిచ్చు!
మధ్య ప్రదేశ్​లో భోపాల్​లో వర్షాల కోసం మూడు నెలల క్రితం వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన కప్ప జంట అంతే శాస్త్రోక్తంగా విడిపోయింది.

వర్షాలు కురవక దేశమంతా బీళ్లు వారుతోందని శివ శక్తి సేవా మండలం వారు కప్పలకు పెళ్లి చేసి వరుణుడి అనుగ్రహం పొందాలనుకున్నారు. జులై 19న ఓ ఆడ కప్ప, ఓ మగ కప్పకు ఇంద్రపురిలోని పరమ శివుని ఆలయంలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. కప్పలను దీవించేందుకు వరుణుడు దిగివచ్చాడు. అప్పటి నుంచి ఆపకుండా వర్షాలు కురిపిస్తూనే ఉన్నాడు.

వర్షాలు వరదగా మారి మానవాళికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆ పెళ్లి పెద్దలే ఇక కురిసిన వర్షాలు చాలించి వచ్చే ఏడు రమ్మని కోరుతూ... ఆ జంటను విడదీయాలని నిర్ణయించారు.
వివాహం జరిపించిన ఆ గుళ్లోనే ఆ బొమ్మ కప్ప జంట వివాహ బంధాన్ని రద్దు చేశారు. పూర్తి సంప్రదాయబద్ధంగా విడాకులు ఇప్పించారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్న ఈ విడాకుల వీడియోను చూసినవారు వర్షాలు ఆపేందుకు కప్పలకు విడాకులు ఇప్పించడమేంటంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చూడండి:తప్పిపోయిన కొడుకు 20ఏళ్లకు అమెరికాలో దొరికాడు!

Last Updated : Sep 30, 2019, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details