తెలంగాణ

telangana

By

Published : Dec 11, 2019, 12:57 PM IST

ETV Bharat / bharat

అసోంలో పౌర బిల్లుకు వ్యతిరేకంగా మిన్నంటిన నిరసనలు

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో నిరసనలు మిన్నంటాయి. పలు చోట్ల విద్యార్థులకు, పోలీసులుకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. విద్యార్థులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది బాష్పవాయువు ప్రయోగించారు.

అసోంలో పౌర బిల్లుకు వ్యతిరేకంగా మిన్నంటిన నిరసనలు
అసోంలో పౌర బిల్లుకు వ్యతిరేకంగా మిన్నంటిన నిరసనలు

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య కేంద్రాలను, దుకాణాలను ఆందోళనకారులు మూసేశారు. పలు జిల్లాల్లో రోడ్లపై వాహన టైర్లను కాల్చి, రాకపోకలు అడ్డుకున్నారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి.

అసోంలో పౌర బిల్లుకు వ్యతిరేకంగా మిన్నంటిన నిరసనలు

దిబ్రూగఢ్​లో విద్యార్థులు పోలీసులపై రాళ్లు దువ్వారు. ప్రతిగా రబ్బరు బులెట్లు, బాష్పవాయువును ప్రయోగించారు భద్రతా సిబ్బంది. చౌల్ఖోవాలో నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details