మన దేశంలో పాత్రికేయం సాగుతున్న తీరుపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. పత్రికా స్వేచ్ఛ ఏకపక్షం (వన్ వే ట్రాఫిక్) కాకూడదని పేర్కొంది. తప్పుడు-కల్పిత కథనాలకు పాత్రికేయంలో స్థానం లేదని వ్యాఖ్యానించింది.
'ది వైర్' వార్తా పోర్టల్‌తోపాటు ఆ సంస్థకు చెందిన కొందరు పాత్రికేయులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జయ్ షా పరువునష్టం కేసు పెట్టారు. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్ర, జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ గవయీలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.