తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇకపై మెట్రోస్టేషన్లలో ఉచితంగా శానిటరీ న్యాప్​కిన్లు - ఇకపై మెట్రో స్టేషన్లలో ఉచితంగా శానిటరీ న్యాప్​కిన్లు

మహిళలు రుతుక్రమంలో శుభ్రంగా ఉండటం ఎంతో అవసరం. అందుకు కావాల్సిన ఉత్పత్తులను కొనే స్తోమత అందరికీ ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం ఉత్తర్​ప్రదేశ్​లోని​ నొయిడా మెట్రోరైల్​ కార్పొరేషన్ (ఎన్​ఎంఆర్​సీ)​ ఉచిత శానిటరీ న్యాప్​కిన్లు అందించేందుకు సిద్ధమైంది. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8 నుంచి 21 స్టేషన్లలో వీటిని పంపిణీ చేయనుంది.

Free sanitary pads at all Aqua Line Metro stations from March 8
ఇకపై మెట్రో స్టేషన్లలో ఉచితంగా శానిటరీ న్యాప్​కిన్లు

By

Published : Mar 6, 2020, 8:46 PM IST

మహిళా దినోత్సవం నుంచి ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది ఉత్తర్​ప్రదేశ్​లోని నొయిడా మెట్రోరైల్​ కార్పొరేషన్​. 21 స్టేషన్లలో మహిళలకు ఉచితంగా శానిటరీ న్యాప్​కిన్లు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆయా స్టేషన్లలో శానిటరీ ప్యాడ్​ వెండింగ్​ మిషన్లను ఏర్పాటు చేస్తోంది.

రెండు పింక్​ స్టేషన్లు

మహిళలకు ప్రత్యేకంగా రెండు పింక్​ స్టేషన్లను ప్రారంభించనుంది ఎన్​ఎంఆర్​సీ. నోయిడాలోని సెక్టార్​76, గ్రేటర్​ నోయిడాలోని పారి చౌక్ స్టేషన్లను ఇందు కోసం వినియోగిస్తున్నారు.

" పింక్​ స్టేషన్లలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. చిన్నారులకు పాలు పట్టేందుకు ప్రత్యేక గదులు, డైపర్లు మార్చేందుకు, బట్టలు మార్చుకునేందుకు సౌకర్యాలు చేశాం. ఈ రెండు స్టేషన్లలో పూర్తి స్థాయిలో మహిళా ఉద్యోగులను నియమించాలనే లక్ష్యంతో ఉన్నాం. 21 స్టేషన్లలో శానిటరీ న్యాప్​కిన్​ వెండింగ్​ మిషన్లు ఏర్పాటు చేస్తాం. ఏ ప్రయాణికురాలైనా వారు పొందిన టోకెన్​ ద్వారా ఉచితంగా శానిటరీ ప్యాడ్​ను తీసుకోవచ్చు. "

- ఎన్​ఎంఆర్​సీ అధికారి. ​

ఏస్​ సంస్థ సహకారంతో..

మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా పింక్​ స్టేషన్లను, వెండింగ్​ మిషన్లను ఎన్​ఎంఆర్​సీ ఎంపీ రీతూ మహేశ్వరి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థిరాస్తి వ్యాపార సంస్థ ఏస్(ఏసీఈ)​ సహకారంతో చేపడుతోంది ఎన్​ఎంఆర్​సీ. ఏడాది పాటు ఏస్​ గ్రూప్​ సంస్థలకు చెందిన ఏస్​ స్టూడియో విభాగం న్యాప్​కిన్ల ఖర్చును బరించనుంది.

ఇదీ చూడండి:టాప్​-100 శక్తిమంతమైన మహిళల్లో ఇందిరా గాంధీ, కౌర్​

ABOUT THE AUTHOR

...view details