తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మళ్లీ ఈవీఎంల సమస్యలు- బంగాల్​లో గొడవలు

ఈవీఎంల మొరాయింపులు, బంగాల్​లో ఘర్షణల మధ్య నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది. ఉదయం పది గంటల వరకు 10.27 శాతం ఓటింగ్ నమోదైంది.

మళ్లీ ఈవీఎంల సమస్యలు- బంగాల్​లో గొడవలు

By

Published : Apr 29, 2019, 11:46 AM IST


నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు 10.27 శాతం పోలింగ్ నమోదైంది. 9 రాష్ట్రాల్లోని 72 లోక్​సభ నియోజకవర్గాల్లో ఎన్నిక జరుగుతోంది. 943 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఉత్తర్​ప్రదేశ్​లో 21.18 శాతం, రాజస్థాన్​లో 30 శాతం, పశ్చిమ బంగలో 34.71 శాతం, హారాష్టలో 6.82 శాతం, జార్ఖండ్​లో 14.77 శాతం, బిహార్​లో 15.6శాతం, మధ్యప్రదేశ్​లో 15.3 , ఒడిశాలో 17 శాతం ఓటింగ్ నమోదైంది.

బరిలో ప్రముఖులు

అఖిలేశ్ యాదవ్​ సతీమణి డింపుల్, మాజీ కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షిద్, కేంద్రమంత్రి సత్యదేవ్ పచౌరీ, సాక్షి మహారాజ్, ఊర్మిళ మతోంద్కర్ ఈ విడతలో తలపడుతున్న ప్రముఖులు.

ఈవీఎంల మొరాయింపు

బిహార్​లోని బెగుసరాయి, ముంగేర్ నియోజకవర్గాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఫలితంగా పోలింగ్​ పోలింగ్ ప్రారంభమైంది. బంగాల్​లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాల్ని మోహరించడం తమకు నచ్చలేదని ఎన్నికలను బహిష్కరించారు స్థానికులు. ఓటర్లు ఆందోళన చేస్తున్న కారణంగా ఆ బూత్​లో ఎన్నికలను రద్దు చేశారు.

అసాన్​సోల్​లో ఘర్షణ

కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో పోటీ చేస్తున్న బంగాల్​లోని అసాన్​సోల్​లో ఘర్షణ చెలరేగింది. తమ ఏజెంట్​కు లంచం ఇవ్వచూపారని సుప్రియోపై ఆరోపణ చేస్తూ తృణమూల్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.

ప్రముఖుల ఓటు

బెగుసరాయి నుంచి పోటీ చేస్తున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, కన్నయ్యకుమార్​ ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్​పవార్ ముంబయిలోని టార్డియో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. పారిశ్రామిక వేత్తలు అనిల్ అంబానీ, ఎన్. చంద్రశేఖరన్, ఆది గోద్రెజ్ ఉదయమే ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఈ విడతతో మహారాష్ట్ర, ఒడిశాల్లో ఎన్నికలు ముగియనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details