తెలంగాణ

telangana

అన్నదాతకే ఆకలి తీర్చిన చిన్నారి

By

Published : Dec 13, 2020, 5:50 AM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న పోరాటానికి బాసటగా నిలిచాడో బుడతడు. తండ్రితో పాటు కర్షకులు నిరసన తెలిపే ప్రదేశానికి వచ్చి వారి ఆకలి తీర్చాడు. తనతో తెచ్చుకున్న బిస్కెట్లు, అరటి పండ్లు వారికి అందించాడు. చిన్న వయసులోనే తన పెద్దమనసు చాటుకున్నాడు.

four year old samaritan distributes biscuits bananas to protesting farmers at delhi ghazipur border
అన్నదాత ఆకలి తీర్చిన చిన్నారి

దిల్లీ-ఘజీపుర్​ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తోన్న నిరసన దీక్షకు తన వంతు మద్దతు తెలిపాడు నాలుగేళ్ల చిన్నారి రేహాన్​. రేయి పగలు అని తేడా తెలియక రైతులు చేస్తోన్న ఆందోళనకు బాసటగా నిలిచాడు. తన వంతు సాయంగా వారికి బిస్కెట్లు, అరటి పండ్లు అందించాడు. బుడతడు చిట్టి చిట్టి చేతులతో ఆహారం అందించడం చూసిన అక్కడి వారు ఆశ్చర్యపోయారు.

"రైతులు నిరసన తెలిపే ఈ ప్రదేశానికి నేను రోజూ వస్తుంటాను. పదిరోజులుగా మా వంతు సాయంగా వారికి చిరు తిండ్లు అందిస్తున్నాను. రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు వారి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. మాది బిహార్​లోని వ్యవసాయ కుటుంబమే. నా సంపాదన 20 వేలు. అందులో నుంచి కొంతభాగం వారి కోసం ఖర్చు చేయడంలో ఆనందం ఉంది. నా కుమారుడు కూడా ఇందులో భాగం అయ్యాడు."

-మెహతాబ్​ ఆలం, రేహాన్​ తండ్రి

పుడమి పుత్రుల కోసం మరి కొందరు..

పక్షం రోజులు పైగా రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇంటిని వదిలి రోజులు గడుస్తున్నా కానీ వెనుదిరగడం లేదు. వారి అన్నపానియాల కోసం కొందరు ముందుకు వస్తున్నారు. ఆ క్రమంలో పంజాబ్​కు చెందిన గుర్వీందర్​ సింగ్​ అనే వ్యక్తి సుమారు 3వేల మంది రైతులకు సింఘు సరిహద్దులో భోజనం వండి పెట్టారు. అన్నం పెట్టే రైతన్న ఆకలితో ఉండడం దేశానికి మంచిది కాదని అంటున్నారు.

రైతుల కోసం వంట చేస్తోన్న గుర్వీందర్​ సింగ్​
భోజనం చేస్తోన్న రైతులు

ఇదీ చూడండి: సింఘు సరిహద్దులో నిరాహార దీక్షకు రైతు సంఘాల పిలుపు

TAGGED:

ABOUT THE AUTHOR

...view details