తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదుల హతం - షోపియాన్​

జమ్ముకశ్మీర్​లో శుక్రవారం రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఎన్​కౌంటర్లు జరిగాయి. షోపియాన్​, పుల్వామాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో మొత్తం నలుగురు ముష్కరులు హతమయ్యారు. వీరికి సహకరించిన మరో వ్యక్తిని అంతమొందించాయి భద్రతా దళాలు.

వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదుల హతం

By

Published : Jun 1, 2019, 5:49 AM IST

వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్​లో జరిగిన వేర్వేరు ఎన్​కౌంటర్​లలో నలుగురు ఉగ్రవాదులు, వారికి సహకరించిన మరో వ్యక్తిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు.

షోపియాన్​లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు హిజ్బుల్​ ముజాహిదీన్​ ముష్కరులతో పాటు.. వారికి సహకరించిన వ్యక్తిని హతమార్చింది సైన్యం.

షోపియాన్​లోని సుగాన్​ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో మొదట భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. భద్రతా సిబ్బందిని ముందే పసిగట్టిన తీవ్రవాదులు .. వారిపై కాల్పులకు తెగబడ్డారు. సమర్థంగా తిప్పికొట్టిన సైన్యం ఇద్దరు ముష్కరులతో పాటు మరొకరిని మట్టుబెట్టింది.

పుల్వామా జిల్లా మిదూరా ప్రాంతంలో జరిగిన మరో ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరుల్ని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

ఇదీ చూడండి:

బిమ్​స్టెక్​ నేతలతో మోదీ స్నేహగీతం

ABOUT THE AUTHOR

...view details