పక్కా సమాచారంతో...
కశ్మీర్లో మరో నలుగురు ముష్కరులు హతం - జమ్ముకశ్మీర్
జమ్ముకశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు. ఉగ్రవాదులంతా లష్కరే తొయిబా సభ్యులని సమాచారం.
ఉగ్రవాదుల సంచారంపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు లస్సీపొరా ప్రాంతంలో ఉదయం నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ముష్కరులు దాడి చేయగా... సిబ్బంది ప్రతిఘటించారు. ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. హతమైన ఉగ్రవాదుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నలుగురి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు.
భద్రతా దళాలు ఘటనాస్థలిలో రెండు ఏకే రైఫిళ్లు, ఒక ఎస్ఎల్ఆర్, ఒక పిస్తోల్స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు, ఒక పోలీసు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉంది.