తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మినీ ట్రక్​ బోల్తా - నలుగురు మృతి - మినీ ట్రక్కు బోల్తా

మధ్యప్రదేశ్​ షింగ్రౌలి జిల్లా భలైయా తోలా గ్రామంలో ఓ మినీ ట్రక్​ బోల్తా పడి నలుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

mini truck overturns in MP
రోడ్డు ప్రమాదం

By

Published : Nov 7, 2020, 3:54 PM IST

మధ్యప్రదేశ్​ షింగ్రౌలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ ట్రక్​ బోల్తాపడి.. నలుగురు మృతి చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది.

జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలోని భలైయా తోలా గ్రామంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సరాయ్​ పోలీసులు తెలిపారు.

" లంఘడోల్​ గ్రామానికి చెందిన కొందరు సమీప గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్​ వాహనంపై నియంత్రణ కోల్పోవటం వల్ల బోల్తా పడింది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి."

- శంఖ్​దార్​ ద్వివేది, సరాయ్​ పోలీస్​ స్టేషన్​ ఇంఛార్జి.

ఘటనా స్థలాన్ని జిల్లా పాలనాధికారి, ఎస్పీ సహా దేవ్సార్​ ఎమ్మెల్యే సుభాష్​ రామ్​చరిత్​ వర్మా సందర్శించారు. ఆసుపత్రిలోని బాధితులను పరామర్శించారు.

ఇదీ చూడండి: దిల్లీలో అంతకంతకూ క్షీణిస్తున్న వాయు నాణ్యత

ABOUT THE AUTHOR

...view details