జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో లష్కరే తోయిబా(ఎల్ఈటీ)తో సంబంధమున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. సోపోర్ ప్రాంతంలో పోలీసు పోస్టుపై జరిగిన గ్రనేడ్ దాడిలో వారి హస్తం ఉందని తెలిపారు. నిందితులను ఇర్ఫాన్ అహ్మద్ మీర్, ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్, కైజర్ రహ్మన్ ఖాన్, సుహైల్ అహ్మద్ గనీలుగా గుర్తించారు పోలీసులు.
లష్కరేతో సంబంధమున్న నలుగురు అరెస్టు
లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న నలుగురు ముష్కరులను జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో అరెస్ట్ చేశారు పోలీసులు. సోపోర్ ప్రాంతంలో పోలీసు పోస్టుపై జరిగిన గ్రనేడ్ దాడుల్లో వారి హస్తం ఉందని తెలిపారు.
పుట్ఖా పోలీసు పోస్టు వద్ద గ్రనేడ్ లాబీయింగ్‌లో కూడా నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు దర్యాప్తులో తెలిసిందన్నారు అధికారులు. ఎల్ఈటీ ఉగ్రవాదులకు లాజిస్టిక్ మద్దతు అందించడం, ఆశ్రయం కల్పించడం సహా ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా వీరంతా ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు.
ఇదీ చూడండి:కేరళలో కరోనా 2.0- రికార్డుస్థాయిలో కేసులు