తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తప్పిపోయిన బాలుడి కథ 'ఆధార్'​తో సుఖాంతం - sonebhadra

ఆధార్​ కార్డుపై ఎన్ని వివాదాలు ఉన్నా.. ఉపయోగాలూ అంతకుమించి ఉన్నాయంటారు కొంతమంది. ఝార్ఖండ్​లో జరిగిన ఓ ఘటనను గమనిస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఎనిమిది నెలల క్రితం తప్పిపోయిన ఓ బాలుడు ఆధార్​ కార్డు సాయంతో వారి తల్లిదండ్రుల చెంతకు చేరాడు.

బాలుడు

By

Published : May 17, 2019, 6:34 AM IST

బాలుడి కథ 'ఆధార్'​తో సుఖాంతం

భారత పౌరులకు విశిష్ట గుర్తింపును ఆధార్​ కార్డ్ ఇస్తోంది. ఆధార్​తో మరో ఉపయోగం చెబితే ఆశ్చర్యపోతారు. 8 నెలల క్రితం తప్పిపోయిన 8 ఏళ్ల బాలుణ్ని తిరిగి వాళ్ల తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

ఏం జరిగింది

2018 సెప్టెంబర్​ 18.. ఉత్తరప్రదేశ్​ సోన్​భద్రలో రైలులో తప్పిపోయిన ఉమన్​.. ఝార్ఖండ్​లోని బర్​కాకానా రైల్వేస్టేషన్​కు చేరుకున్నాడు. అతని పరిస్థితి చూసిన రైల్వే పోలీసులు.. వివరాలు అడడగా ఉమన్​ చెప్పలేకపోయాడు. అతడ్ని బాలల సంరక్షణ కేంద్రంలో అప్పగించారు.

బాలుణ్ని పాఠశాలలో చేర్పించేందుకు సంరక్షణ కేంద్రం అధికారులు వెళ్లగా కథ మరో మలుపు తిరిగింది. పాఠశాలలో చేర్చుకునేందుకు ఆధార్​ కార్డు అవసరమైంది.

"బాలుడి కోసం చేసిన ఆధార్​ కార్డు దరఖాస్తును తిరస్కరించింది వెబ్​సైట్. అతడికి ముందే ఆధార్​ ఉన్నట్టు తెలిపింది. వేలిముద్రల ఆధారంగా పాత ఆధార్​ సంఖ్య​ గుర్తించి అతడి తండ్రి రాజేశ్వర్​ చరవాణి నంబరు కనుక్కున్నాం. 8 నెలల తర్వాత ఆ బాలుడు ఇంటికి వెళుతున్నాడు. ఇదంతా ఆధార్​ కార్డు ఉండటం వల్లే సాధ్యమైంది."

-రాజేశ్వరి, రామ్​గఢ్ కలెక్టర్​

కుమారుడు దొరికాడన్న సమాచారం వినగానే సంతోషంగా ఝార్ఖండ్​ చేరుకున్నారు బాలుడి తండ్రి రాజేశ్వర్. ఎనిమిది నెలల తర్వాత ఉమన్​ను చూసి​ ఆనందంతో మురిసిపోయాడు.

ఇదీ చూడండి: చైన్​ కోసం ఎంతకు తెగించారో చూడండి...

ABOUT THE AUTHOR

...view details