నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి ముందు కాంగ్రెస్ కీలక భేటీ నిర్వహించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై మన్మోహన్ సింగ్ పలు సూచలు చేసినట్లు సమాచారం.
ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లోని గిరిజనులు, రైతుల సమస్యలను నీతి ఆయోగ్ ముందు ప్రస్తావించాలని సింగ్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై కేంద్రం అశ్రద్ధ, అటవీ చట్టంలో సవరణలు, గిరిజనుల అభివృద్ధి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ వంటి విషయాలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం.