తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాస్కు లేకుండా పెళ్లి వేడుకకు హాజరైన ఆరోగ్యమంత్రి

కర్ణాటకలో ఆరోగ్యమంత్రి ఓ పెళ్లి వేడుకకు హాజరై మాస్కు పెట్టుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఓ ఎమ్మెల్యే కుమారుడి వివాహ వేడుకలో భౌతికదూరంతో పాటు ఇతర కరోనా నిబంధనలు కూడా పాటించలేదు. ఫలితంగా ఆరోగ్యమంత్రితో పాటు వేడుకకు హాజరైన ఇతర ప్రజాప్రతినిధులకూ విమర్శలు తప్పట్లేదు.

COVID norms Threw into the Wind
పెళ్లేమే ఘనంగా.. కరోనా నిబంధనలేమో గాల్లోకి

By

Published : Jun 15, 2020, 7:55 PM IST

Updated : Jun 15, 2020, 8:10 PM IST

కర్ణాటక మాజీ మంత్రి, హూవిన హడగలి ప్రస్తుత ఎమ్మెల్యే పీటి పరమేశ్వర్ కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లి వేడుకలో కరోనా నిబంధనలు మాత్రం గాలికొదిలేశారు. అతిథుల్లో చాలామంది మాస్కు కూడా ధరించలేదు. కర్ణాటక ఆరోగ్య మంత్రి కూడా ఈ నిబంధనలు ఉల్లంఘించడం విమర్శలకు తావిస్తోంది.

కరోనా నిబంధనలు గాల్లోకి
కరోనా నిబంధనలు గాల్లోకి
కరోనా నిబంధనలు గాల్లోకి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే ఒక్కరూ భౌతికదూరాన్ని పాటించలేదు. బాధ్యతగల ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి కరోనా నిబంధనలను గాల్లోకి వదిలడం​పై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

కరోనా నిబంధనలు పాటించకుండా వివాహ వేడుక
Last Updated : Jun 15, 2020, 8:10 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details