తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఫొని'పై అసోం ముందు జాగ్రత్త చర్యలు

ఒడిశా, పశ్చిమ బంగ రాష్ట్రాల్ని అస్తవ్యస్తం చేసిన ఫొని తుపాను ఈశాన్య రాష్ట్రాలపై పంజా విసరనుంది. అసోంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలకు ఇప్పటికే రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు చేరుకున్నాయి.

ఫొని తుపానుపై అసోం ముందు జాగ్రత్త చర్యలు

By

Published : May 4, 2019, 10:23 AM IST

తూర్పు తీర రాష్ట్రాలు ఒడిశా, బంగాల్​లో బీభత్సం సృష్టించిన ఫొని తుపాను నేడు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసోం ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. కావలసిన చర్యలను చేపట్టాలని ఆదేశించింది. నేడు, రేపు పశ్చిమ, మధ్య అసోం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

అసోం విపత్తు నిర్వహణ దళం అధికారులు 40 ప్రాంతాల్లో మోహరించారు. ఎన్​డీఆర్​ఎఫ్ దళాలు తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న కచార్​, బార్​పేట, బోన్​గయిగావ్, సోనిత్​పూర్, తిన్​సుకియా, జొర్​హత్​ జిల్లాలకు చేరుకున్నారు. బాధితులను కాపాడేందుకు ఆరు, కనీస అవసరాలు అందించేందుకు మరో ఐదు హెలికాప్టర్లను సిద్ధం చేశారు. తుపాను సహాయార్థం కంట్రోల్​రూమ్​లు ఏర్పాటు చేశారు. బాధితులు 1070, 1077, 1079 నెంబర్లకు కాల్ చేయొచ్చని పేర్కొన్నారు.

ఐఈఈఎమ్​ఏ సాయం

ఫొని బాధిత రాష్ట్రం ఒడిశాకు చేయూతనందిస్తామని భారత ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంఘం(ఐఈఈఎమ్​ఏ) వెల్లడించింది. వేగంగా విద్యుత్​ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని ముందుకొచ్చింది. ముందుగా అత్యంత అవసరమైన ప్రాంతాల్లో చర్యలు చేపడతామని పేర్కొంది.

టెలికాం విభాగం సమీక్ష

తుపాను బాధిత రాష్ట్రాల్లో టెలికాం సేవలపై సమాచార శాఖ సమీక్షించింది. దెబ్బతిన్న ప్రాంతాల్లో టెలికాం సేవల పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేసింది. ధ్వంసమైన చోట్ల వివిధ నెట్​వర్క్​ల మధ్య ఉచిత ఫోన్​కాల్​లకు అనుమతించింది. అత్యవసర సేవల కోసం 1938 నెంబర్​ను ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి: నదిలోకి విమానం- ప్రయాణికులు సురక్షితం

ABOUT THE AUTHOR

...view details