తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వృద్ధి మందగమనాన్ని ఆర్థిక మంత్రి అంగీకరించాలి'

దేశంలో ఆర్థిక మందగమనం ఉందన్న విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​ అంగీకరించాలని డిమాండ్​ చేశారు కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ. ఆర్థిక వ్యవస్థపై రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు.

'వృద్ధి మందగమనాన్ని ఆర్థిక మంత్రి అంగీకరించాలి'

By

Published : Sep 2, 2019, 5:14 AM IST

Updated : Sep 29, 2019, 3:25 AM IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​పై విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. దేశంలో ఆర్థిక మందగమనం ఉందన్న విషయాన్ని ఆర్థికమంత్రి అంగీకరించాలని డిమాండ్​ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై రాజకీయాలు చేయడం మాని.. స్వచ్ఛందంగా ప్రజల ముందుకు రావాలన్నారు.

ఆర్థిక రంగంలోని సమస్యలను విభాగాల పరంగా వింటున్నామన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలపై ప్రియాంక ఈ మేరకు స్పందించారు.

ప్రియాంక ట్వీట్​

" ఆర్థిక మందగమనం ఉందని ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా? దేశ ఆర్థిక రంగంపై రాజకీయాలు మాని స్వచ్ఛందంగా ప్రజల ముందుకు రావాలి. ఆర్థిక మందగమనాన్ని అంగీకరించకపోతే వారు సృష్టించిన ఈ భారీ సమస్యను ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? "

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధానకార్యదర్శి.

విదేశీ పెట్టుబడుల మందమగనం, వినియోగం తగ్గుదలతో భారత ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ఠానికి 5 శాతం దిగువకు పడిపోయింది. ఆర్థిక మాంద్యం సూచనలతో ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది.

ఇదీ చూడండి: వారిని ఇప్పుడే విదేశీయులుగా పరిగణించం: రవీశ్​

Last Updated : Sep 29, 2019, 3:25 AM IST

ABOUT THE AUTHOR

...view details