తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదుగురు సహచరుల్ని కాల్చి చంపిన జవాను - six ITBP jawans killed

six ITBP jawans killed
జవాన్ల మధ్య ఘర్షణ- కాల్పుల్లో ఆరుగురు మృతి

By

Published : Dec 4, 2019, 11:17 AM IST

Updated : Dec 4, 2019, 12:40 PM IST

12:39 December 04

ఛత్తీస్​గఢ్​ నారాయణ్​పుర్​లో ఘోరం జరిగింది. నక్సల్ ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఐటీబీపీ జవాన్లు ఘర్షణ పడ్డారు. బంగాల్​ నదియాకు చెందిన కానిస్టేబుల్​ మసూదుల్​ రహ్మాన్​... సహచరులపై తుపాకీతో విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. 

సహచరుల్ని హత్య చేసిన తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు రహ్మాన్. 

ఈ ఘటనను ఐటీబీపీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఘర్షణకు దారి తీసిన కారణాలపై దర్యాప్తునకు ఆదేశించారు. 

రహ్మాన్​ చేతిలో గాయపడ్డ జవాన్లు రాయ్​పుర్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 

11:14 December 04

జవాన్ల మధ్య ఘర్షణ- కాల్పుల్లో ఆరుగురు మృతి

ఛత్తీస్​గఢ్​ నారాయణ్​పుర్​లో ఘోరం జరిగింది. నక్సల్ ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఐటీబీపీ జవాన్లు ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని రాయ్​పుర్​ ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Dec 4, 2019, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details