తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఆసుపత్రిలో తిరిగే చేపలు భలే టేస్టీ గురూ! - పట్నా

చిన్న వర్షానికే బిహార్​ రాజధాని పట్నా జలమయం అవుతోంది. ఇటీవల కురిసిన వర్షానికి నలంద వైద్య కళాశాల ఆసుపత్రి ఓ చెరువులాగా మారిపోయింది. మహిళల విభాగంలో చేపపిల్లలు దర్శనమిచ్చాయి.

ఆ ఆస్పత్రిలో తిరిగే చేపలు భలే టేస్టీ గురూ!

By

Published : Jul 9, 2019, 4:44 PM IST

ఆ ఆసుపత్రిలో తిరిగే చేపలు భలే టేస్టీ గురూ!

రుచి కరమైన చేపలు కావాలా...? మీరే వాటిని పట్టాలని సరదాగా ఉందా..? చెరువులోకి దిగడానికి భయమా..? అయితే మీకిది కచ్చితంగా శుభవార్తే. మీరు నేలపై నడుస్తూనే చేపలు పట్టుకోవచ్చు అక్కడ. చేపలు మీ చేతి నుంచి జారుకునే ప్రమాదమే లేదసలు. చుట్టూ రోగులుంటారు. మీ చేపల వేటను చూసి నవ్వుతుంటారు. ఇదిగో ఇక్కడ ఉందని చెబుతుంటారు. ఎంత సౌలభ్యమో కదా...! ఇవన్నీ మీకు కల్పిస్తోంది పట్నాలోని నలందా వైద్య కళాశాల ఆసుపత్రి.

బిహార్ పట్నాలో కురిసిన కొద్దిపాటి వర్షానికే నలంద వైద్య కళాశాల ఆస్పత్రి జలమయం అయింది. వార్డులు చెరువును తలపించాయి. మహిళల మెడికల్ వార్డులో చేరిన నీటిలో చేపపిల్లలు ఎంచక్కా చక్కర్లు కొడుతున్నాయి.

ఎన్ఎంసీహెచ్​ను ప్రపంచస్థాయి సౌకర్యాలున్న ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఆసుపత్రిలోని చేపలను చూస్తుంటే చెరువే గుర్తుకు వస్తోంది.

ఆసుపత్రిలో నీరు బయటకు పంపించే పనులు వేగంగా జరుగుతున్నాయని, మరికొద్ది రోజుల్లోనే సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.

"నీళ్లు చేరితే వాటితో పాటు చేపలు వస్తాయి. నేనైతే చూడలేదు కానీ వచ్చి ఉండవచ్చు. ప్రభుత్వానికి ముందు నుంచి విషయం తెలుసు. ప్రతి వర్షాకాలంలోనూ వార్డుల్లోకి నీరు చేరుతోంది."

-డాక్టర్ రవిరంజన్ కుమార్, అధ్యక్షుడు, జూనియర్ డాక్టర్ల సంఘం

అలాగే నెట్టుకొస్తున్న రోగులు

వర్షపు నీటిలోనే రోగులు వైద్య చికిత్సలు పొందుతున్నారు. పాములు, తేళ్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

వర్షం వల్ల వార్డులోకి వచ్చిన మురికి నీరు కారణంగా దుర్వాసన వస్తోందని వార్డులో పనిచేసే నర్సులు, రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'నగర పాలిక పాపమే'

ఆసుపత్రిలోకి నీరు చేరడానికి కారణం నగర పాలిక నిర్లక్ష్య ధోరణే కారణమని ఎన్ఎంసీహెచ్ డివిజన్​కు చెందిన మాజీ కార్పొరేటర్ రామ్​నాథ్ చౌదరి ఆరోపించారు. నగర పాలిక చేసిన తప్పుల వల్లే ఆసుపత్రిలోకి నీరు చేరిందన్నారు.

ఇదీ చూడండి: భారత్​కు త్వరలో మరో 2 షినుక్​ హెలికాప్టర్లు

ABOUT THE AUTHOR

...view details