కరోనా వైరస్ చికిత్సలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్లాస్మా థెరపీ చేసిన మొట్టమొదటి రోగి శనివారం గుండెపోటుతో మరణించాడు. లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ వైద్య విశ్వవిద్యాలయం (కేజీఎంయూ)లో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న 58 ఏళ్ల వ్యక్తి.. శనివారం తుదిశ్వాస విడిచినట్లు కేజీఎంయూ ఉప కులపతి ఎంఎల్‌బీ భట్ తెలిపారు. గత 14 రోజులుగా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
" మొదట్లో రోగి ఆరోగ్యం స్థిమితంగానే ఉంది. అతని ఊపిరితిత్తులు మెరుగయ్యాయి.. కానీ, కొద్ది రోజులకు మూత్రాశయ సమస్యలు తలెత్తాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు గుండె పోటు వచ్చింది. వైద్యులు అన్ని విధాల ప్రయత్నించినా.. కాపాడలేకపోయారు. ఈ రోజు వచ్చిన రెండు పరీక్షల ఫలితాల్లో కరోనా నెగిటివ్‌గా తేలింది."