నేడు రాత్రి ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. ఈ ఏడాది తొలి సంపూర్ణ చంద్రగ్రహణం ఇవాళ రాత్రి ఏర్పడనుంది. భారత్లో మాత్రం ఇది పాక్షికంగా కనిపించనుంది. దేశ నలుమూలల నుంచి ఈ అద్భుతాన్ని వీక్షించే వీలుంది.
చంద్రగ్రహణం నేడు (శుక్రవారం) రాత్రి 10.37 గంటల నుంచి 2.42 గంటల వరకు ఉండనుందని ఎం.పి.బిర్లా ప్లానిటోరియం అధికారి ఒకరు వెల్లడించారు. నేటితో కలిపి ఈ ఏడాది మొత్తం నాలుగు సార్లు (జూన్ 5, జూలై 5, నవంబర్ 30 ) చంద్రగ్రహణం సంభవించనున్నట్లు తెలిపారు.