తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిప్పులు చెరిగే 'రఫేల్' విమానాలు ఎప్పుడొస్తాయంటే...

కరోనా ఇబ్బందుల కారణంగా రఫేల్​ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరేందుకు మరింత సమయం పట్టనుంది. మే మొదటి వారంలో ఫ్రాన్స్​ నుంచి భారత్​కు రావాల్సిన ఈ విహంగాలు.. జూలై చివరి నాటికి అందనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే వీటిని నడపడానికి పైలట్​లకు శిక్షణ కూడా పూర్తయినట్లు వెల్లడించింది భారత వాయుసేన(ఐఏఎఫ్​) వెల్లడించింది.

First four Rafale jets likely to arrive in India by last week of July
ఆలస్యంగా భారత్​కు రఫేల్​ యుద్ధ విమానాలు.. కారణం అదే!

By

Published : May 16, 2020, 12:41 PM IST

మహమ్మారి కరోనా కారణంగా ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్​ నుంచి మే తొలివారంలో భారత్​కు రావాల్సిన రఫేల్​ యుద్ధ విమానాలు.. 11 వారాలు ఆలస్యంగా అమ్ములపొదిలో చేరనున్నాయి. 36 విహంగాల్లో తొలి నాలుగు.. జూలై చివరి వారంలో భారత్​కు చేరతాయని అధికారులు వెల్లడించారు.

శిక్షణ పూర్తి..

యుద్ధ విమానాలను స్వాగతించడానికి ఇప్పటికి అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేసినట్లు భారత వాయుసేన(ఐఏఎఫ్​) తెలిపింది. పైలట్లకు శిక్షణ కూడా పూర్తయినట్లు స్పష్టం చేసింది.

వ్యూహాత్మక స్థావరాల్లో..

తొలి వైమానిక దళ బృందాన్ని అంబాలా విమానాశ్రయంలో ఉంచనున్నట్లు సమాచారం. దీనిని అత్యంత వ్యూహాత్మక స్థావరాలలో ఒకటిగా భావిస్తారు. అక్కడ నుంచి పాక్​ సరిహద్దుకు 220 కిలోమీటర్ల దూరమే ఉండటం కారణం.

2016లోనే ఒప్పందం..

రూ.58,000 కోట్ల వ్యయంతో 36 రఫెల్​ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి 2016 సెప్టెంబరు​లో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది భారత్. 36 రఫేల్​ విమానాల్లో 30 యుద్ధ విమానాలు కాగా... 6 శిక్షణ విమానాలు. ఇవి అత్యంత శక్తిమంతమైన ఆయుధాలను మోయగలవు.

ఇదీ చూడండి:రిక్షా బాలుడు: తల్లీదండ్రుల భారాన్ని.. వందల కి.మీ మోస్తూ..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details