మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. శివసేన కార్యకర్త చంద్రశేఖర్ జాదవ్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఉదయం 7.15 గంటల ప్రాంతంలో విఖ్రోలిలోని ఠాగూర్ నగర్ ప్రాంతంలోని సాయిబాబా ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది.
ఆలయ పరిసరాల్లో తన కుమారుడితో జాదవ్ కూర్చున్న సమయంలో ఆయనపై కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. ఐదు రౌండ్లు కాల్పులు చేపట్టిగా.. శేఖర్‌జాదవ్ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అదిస్తున్నారు. కాల్పులు జరిపిన దుండగుడిని స్థానికులు పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.