తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నోయిడా పవర్​ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం - ఉత్తర్​ప్రదేశ్​లో అగ్ని ప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడా పవర్​ కంపెనీ లిమిటెడ్​లోని(ఎన్​పీసీఎల్​) అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Fire has broken out at substation of Noida Power Company Limited in Greater Noida
నోయిడా పవర్​ కంపెనీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

By

Published : Aug 19, 2020, 11:03 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడా పవర్​ కంపెనీ లిమిటెడ్​లోని(ఎన్​పీసీఎల్​) సెక్టార్​​ 148 సబ్‌స్టేషన్​ వద్ద తీవ్రంగా మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది...తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేస్తున్నారు.

భారీ ఎత్తున అగ్ని జ్వాలలు ఎగసిపడటం వల్ల పరిసర ప్రాంతాల్లో పొగ అలుముకుంది. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

నోయిడా పవర్​ కంపెనీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

ABOUT THE AUTHOR

...view details