తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం- 8 మంది కొవిడ్​ రోగులు మృతి - అహ్మదాబాద్​ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

fire broke out At shrey hospital
ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

By

Published : Aug 6, 2020, 7:36 AM IST

Updated : Aug 6, 2020, 11:27 AM IST

08:07 August 06

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

గుజరాత్​ అహ్మదాబాద్​లోని శ్రేయ్​ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐసీయూ వార్డ్​లో ఉన్న మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. 

40 మంది రోగులను రక్షించి నగరంలోని మరో ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ప్రధాని దిగ్భ్రాంతి..

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు ప్రధాని రిలీఫ్​ ఫండ్​ నుంచి రూ. 2లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి రూ.50 వేలు ఇవ్వనున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కొరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.

ఘటనపై రాష్ట్ర సీఎం విజయ్​ రూపానీ దర్యాప్తునకు ఆదేశించారు. మూడు రోజుల్లో నివేదిక అందజేయాలన్నారు.

07:35 August 06

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం- 8 మంది కొవిడ్​ రోగులు మృతి

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

గుజరాత్​ అహ్మదాబాద్​ శ్రేయ్​ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది కొవిడ్​ రోగులు ప్రాణాలు కోల్పోయారు. 

Last Updated : Aug 6, 2020, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details