తెలంగాణ

telangana

ETV Bharat / bharat

షాపింగ్ సెంటర్​లో​ భారీ అగ్ని ప్రమాదం - మహారాష్ట్రలో అగ్నిప్రమాదం

మహారాష్ట్ర ముంబయిలోని ఓ షాపింగ్ సెంటర్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని... మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తోన్నారు.

Fire breaks out at a shopping centre at Borivali West in Mumbai
మహారాష్ట్రలో షాపింగ్ సెంటర్​లో​ భారీ అగ్ని ప్రమాదం

By

Published : Jul 11, 2020, 10:34 AM IST

మహారాష్ట్ర ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బోరీవలీలోని షాపింగ్​ సెంటర్​లో శనివారం వేకువజామున మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేస్తున్నారు.

షాపింగ్​ సెంటర్​పై అంతస్తులకూ మంటలు వ్యాపించాయి. వాటిని అదుపు చేయడానికి ఫైర్​ రోబోట్​ సాయంతో నిర్విరామంగా కృషి చేస్తున్నారు సిబ్బంది. మరో రెండు 2 గంటల్లో మంటలు అదుపులోకి రావొచ్చని అధికారులు తెలిపారు.

మహారాష్ట్రలోని షాపింగ్ సెంటర్​లో​ భారీ అగ్ని ప్రమాదం
మంటలు అదుపు చేస్తున్న సిబ్బంది
అలుముకున్న పొగ
చీకటిలోనూ తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
మంటలు అదుపు చేస్తున్న ఫైర్​ రోబోట్​
అగ్నిమాపక సిబ్బంది

ఇదీ చూడండి:దేశంలో కొత్తగా 27,114 కరోనా కేసులు.. 519 మరణాలు

ABOUT THE AUTHOR

...view details