తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కమల్ హాసన్​ వ్యాఖ్యలపై ఎఫ్​ఐఆర్​ నమోదు - Kamal

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌పై ఎఫ్​ఐఆర్ నమోదైంది. హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందునే భారత శిక్షాస్మృతిలోని సెక్షన్​ 153ఏ, 295ఏ ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కమల్ హాసన్​ వ్యాఖ్యలపై ఎఫ్​ఐఆర్​ నమోదు

By

Published : May 15, 2019, 5:32 AM IST

కమల్​ వ్యాఖ్యలపై ఎఫ్​ఐఆర్​

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌పై తమిళనాడు కారూర్​ జిల్లాలోని అరవకురిచిలో ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు. హిందువులపై కమల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే కేసు నమోదైంది. కమల్​ వ్యాఖ్యలు రెండు వేర్వేరు వర్గాల మధ్య వివాదాలు తెచ్చేలా ఉన్నందున భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్​ 153ఏ, 295ఏ ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఓ ప్రచార ర్యాలీలో కమల్ ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారత్‌లో ‘తొలి ఉగ్రవాది హిందువే’ అని వ్యాఖ్యానించారు. నాథూరామ్‌ గాడ్సేను ఉద్దేశిస్తూ కమల్​ ఈ విమర్శలు చేశారు.

కమల్ వ్యాఖ్యలను భాజాపా, అన్నాడీఎంకే పార్టీలు ఖండించినా... కాంగ్రెస్​, ద్రవిడ మున్నేట్ర కజగమ్ పార్టీలు కమల్​కు మద్దతుగా నిలిచాయి.​

ABOUT THE AUTHOR

...view details