తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కళ్లలో పెట్టుకున్న పల్లె తల్లి

పల్లెల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఆదాయాన్ని ఆర్జించే వారు ఎక్కువ మంది ఉంటారు. కానీ పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామాల్లోనే వయో వృద్ధుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 60 ఏళ్లకు పైబడిన వయోవృద్ధుల్లో 53 % పురుషులు, 24 % మంది మహిళలు ఆర్థికంగా స్వతంత్ర జీవనం గడుపుతున్నట్లు తేలింది.

FINANCIAL STATUS OF OLDER PEOPLE IN INDIA
కళ్లలో పెట్టుకున్న పల్లెతల్లి

By

Published : Jul 24, 2020, 8:11 AM IST

మన పల్లెలు ఎప్పటికీ పట్టుకొమ్మలేనని మరోసారి రుజువైంది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామాల్లోనే వయో వృద్ధుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ)లో వెల్లడైంది. ముఖ్యంగా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 60 ఏళ్లకు పైబడిన వయోవృద్ధుల్లో 53 % పురుషులు, 24 % మంది మహిళలు ఆర్థికంగా స్వతంత్ర జీవనం గడుపుతున్నట్లు తేలింది. వయోవృద్ధుల ఆర్థిక, సామాజిక స్థితిగతులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటున్నాయి. అది కూడా మహిళలు, పురుషుల స్థితి భిన్నంగా ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన ఈ నమూనా సర్వే తేల్చి చెప్పింది. ఒంటరి వృద్ధుల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగా ఉండడం విశేషం. గ్రామీణ వృద్ధుల్లో ఒంటరిగా ఉంటున్న పురుషుల సంఖ్యలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా మహిళల విషయంలో దేశంలో మూడో స్థానంలో నిలుస్తోంది.

  • ఇక్కడి పట్టణ ప్రాంతాల్లోని పురుషుల్లో ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నవారు గ్రామాల్లో కంటే 6% తక్కువగా ఉండగా మహిళల్లో కేవలం 2 % మందే ఆర్థికంగా ఎవరిమీదా ఆధారపడకుండా జీవిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ఇది 22 % తక్కువ. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధుల్లో 10.4 % పురుషులు ఒంటరిగా జీవిస్తున్నారు. దేశంలో అండమాన్‌ నికోబార్‌ దీవులు (13.3 శాతం) తర్వాత ఇదే అధికం. జీవిత భాగస్వామితో ఉంటున్న పురుషులు 42.1 %, ఉమ్మడికుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నవారు 35.4 %, పిల్లలతో కలిసి ఉంటున్నవారు 12.1 %, ఇతర బంధువులతో ఉంటున్నవారు 0.1 % మంది ఉన్నారు.

  • గ్రామీణ ప్రాంతాల్లో 23.4% మంది మహిళలు ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. దేశంలో డామన్‌ డయ్యూ (50 శాతం), లక్షద్వీప్‌ (33.9 శాతం) తర్వాత ఇదే అత్యధికం. ఇది పురుషులకంటే చాలా ఎక్కువ. అలాగే జీవిత భాగస్వామితో కలిసి ఉంటున్న మహిళల శాతం 18.5%, ఉమ్మడి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నవారు 7.5%, పిల్లలతో కలిసి ఉంటున్నవారు 37.1%, ఇతర బంధువులతో కలిసి ఉంటున్నవారు 13.6% మేర ఉన్నారు.
  • తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో పురుషులెవ్వరూ ఒంటరిగా లేరు. 18.5 % మంది జీవితభాగస్వామితో, 67.2% మంది ఉమ్మడి కుటుంబ సభ్యులతో, 12.1 % మంది పిల్లలతో, 2.2 % మంది ఇతర బంధువులతో ఉంటున్నారు. ఇక్కడ మహిళల విషయానికొస్తే 1.4 % మంది ఒంటరిగా ఉంటున్నారు. 6.2 % మంది జీవిత భాగస్వామితో, 50 % మంది ఉమ్మడి కుటుంబసభ్యులతో జీవిస్తున్నారు. 39.4 % మంది పిల్లలతో కలిసి ఉంటున్నారు. 3.1 % మంది ఇతర బంధువులతో జీవనం సాగిస్తున్నారు.

ఇదీ చూడండి:క్వారంటైన్ కేంద్రంలో 'మురళీ' గానం.. చిందేసిన రోగులు

ABOUT THE AUTHOR

...view details