తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సైన్యంలో మహిళలు చేరేది దేశ సేవకు కాదు!' - బీఎస్​ఎఫ్​

సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​)లో మహిళలు ఎక్కువగా చేరడానికి కారణం దేశ సేవ కోసం కాదని తేల్చింది ఓ నివేదిక. ఆర్థిక భద్రత కోసమే బీఎస్​ఎఫ్​లో చేరామని ఎక్కువమంది సిబ్బంది వెల్లడించినట్లు పేర్కొంది. 50 శాతం మంది మహిళా ఉద్యోగులు 20 ఏళ్ల అనంతరం పనిని వదిలేస్తామని చెప్పగా...  18 శాతం మంది మహిళలు పదవీ విరమణ వరకు కొనసాగుతామని చెప్పారని స్పష్టం చేసింది నివేదిక.

బీఎస్​ఎఫ్​లో మహిళల చేరికకు కారణాలు

By

Published : Sep 8, 2019, 3:18 PM IST

Updated : Sep 29, 2019, 9:30 PM IST

మహిళలు ఎక్కువగా సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​)లో చేరడానికి కారణం దేశ సేవ చేయాలన్న ఆలోచన కాదని ఓ అధ్యయనం తేల్చింది. ఆర్థిక భద్రత కోసమే బీఎస్​ఎఫ్​లో మహిళల చేరిక ఎక్కువగా ఉందని ఆ దళ అధికారి ఒకరు చేసిన పరిశీలనలో స్పష్టమయింది. మగవారు ఎక్కువగా ఉండే కేంద్ర భద్రతా బలగాల్లో మహిళలు చేరేందుకు ఆసక్తి చూపించడం అనే అంశమై జరిగిన తొలి విశ్లేషణాత్మక అధ్యయనం ఇది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ అనే మ్యాగజైన్​లో ప్రచురితమైంది ఈ అధ్యయనం.

80శాతం కంటే ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు ఆర్థిక అంశాలే సైన్యంలో చేరడానికి కారణం అని చెప్పినట్లు పేర్కొందీ నివేదిక. 55 మందిలో 11 మంది మాత్రమే దేశానికి సేవ చేసేందుకు అందులో చేరినట్లు వెల్లడించింది. 50శాతం మంది తాము 20ఏళ్లలో ఉద్యోగాన్ని వదిలేస్తామని తెలపగా, 18శాతం మంది మాత్రమే పదవీ విరమణ వరకు పని చేస్తామని చెప్పినట్లు వెల్లడించింది.

బీఎస్​ఎఫ్​లోని అనేక మంది మహిళా సిబ్బందికి వైద్యులు సరిగా అందుబాటులో లేరని, రుతుక్రమ సమయంలో సరైన విశ్రాంతి గది సౌకర్యాలు లేవని తెలిపింది. సైన్యంలో చేరిన తర్వాత సమాజంలో తమ హోదా పెరిగిందని భావిస్తున్నట్లు పలువురు మహిళా ఉద్యోగులు తెలిపారని స్పష్టం చేసింది.

పని ప్రదేశాల్లో ఎలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కోలేదని ఎక్కువమంది మహిళా సిబ్బంది పేర్కొనగా... అతికొద్ది మంది మాత్రమే ద్వంద్వ వ్యాఖ్యలను ఎదుర్కొన్నట్లు స్పష్టం చేసింది. మహిళా సిబ్బంది అంతా ఎనిమిది గంటల లోపే పడుకుంటున్నామని పేర్కొనగా ... 17మంది మాత్రం ఆరు గంటల్లోపే తమ నిద్రా సమయం ఉందని వెల్లడించారని తెలిపింది.

ఎక్కువమంది మహిళలు ఇంటివద్ద ఉన్న తమ పిల్లల గురించి ఆందోళన వ్యక్తం చేశారని నివేదిక బయటపెట్టింది. పని ప్రదేశాల్లోనే చిన్నారులను చూసుకునేందుకు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని తెలిపినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: అండర్​ వరల్డ్​ డాన్​లు,​ అగ్రనేతలు జెఠ్మలానీ క్లయింట్లే!

Last Updated : Sep 29, 2019, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details