తెలంగాణ

telangana

జీఎస్టీతో సినీ పరిశ్రమకు ఇబ్బందులు: కమల్​​

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వల్ల సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు పడుతోందన్నారు సినీ నటుడు, మక్కల్​ నీది మయ్యం పార్టీ అధినేత కమల్​ హాసన్. ఈ పన్నుల విధానాన్ని వ్యతిరేకిస్తూ తను చేసిన హెచ్చరికలను తేలికగా తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

By

Published : Jan 12, 2020, 5:46 PM IST

Published : Jan 12, 2020, 5:46 PM IST

Film Industry is suffering because of GST, says Kamal Haasan
జీఎస్టీతో సినీ పరిశ్రమకు ఇబ్బందులు: కమల్​​

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వల్ల సినీ పరిశ్రమ ఇబ్బందులకు గురవుతోందన్నారు సినీ నటుడు, మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్​ హాసన్. ​ నూతనంగా తీసుకొచ్చిన పన్నుల విధానంపై ప్రభుత్వంతో మాట్లాడాలని సూచించారు. గతంలో తాను చేసిన హెచ్చరికలను తేలికగా తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

'యస్​కాన్​ 2020' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జీఎస్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు కమల్​. జీఎస్టీ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడాలని సినీ పరిశ్రమను కోరిన ప్రయోజనం లేదని వాపోయారు.

"జీఎస్టీకి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పిన వ్యక్తుల్లో నేనూ ఒకరిని. దీనిని అమల చేసే విషయంలో నేను సినీ పరిశ్రమను ఎప్పటికప్పడు హెచ్చరిస్తూనే ఉన్నాను. జీఎస్టీ అమలుపై ప్రభుత్వంతో మాట్లాడాలి. పన్ను విధానంపై ఎంత దూరమైన వెళతామని వివరించాలి. జీఎస్టీ అమలును సీనీ వర్గాల సోదరులు తేలికగా తీసుకున్నారు. మనము భారీగా చెల్లిస్తున్నాం."
-కమల్​హాసన్, మక్కల్​ నీది మయ్యం అధినేత.

కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన పౌరచట్టాన్ని తప్పుబట్టారు కమల్​. ఈ చట్టాన్ని ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి శస్త్ర చికిత్స చేయటం లాంటి నేరపూరిత చర్యగా అభివర్ణించారు.

ఇదీ చూడండి:కశ్మీర్​లో ఎదురుకాల్పులు-ముగ్గురు ముష్కరులు హతం

ABOUT THE AUTHOR

...view details